Renu Desai : పవన్ విజయం పై రేణూదేశాయ్ పోస్ట్.. ఈ గెలుపుతో ఏపీ ప్రజలు..
పవన్ విజయం పై రేణూదేశాయ్ పోస్ట్. ఈ గెలుపుతో ఆద్య అండ్ అకిరా ఎంతో సంతోష పడుతున్నారు. అలాగే ఏపీ ప్రజలు కూడా..
- By News Desk Published Date - 05:00 PM, Tue - 4 June 24

Renu Desai : పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్.. జనసేనని విజయం పై పోస్ట్ వేశారు. ఏపీ ఎన్నికల్లో ఎన్నడూ లేని ఉత్కంఠతో జరిగిన 2024 అసెంబ్లీ పోరు ఫలితాలు వచ్చేసాయి. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడం కోసం కూటమిని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్.. ఓటు షేర్ అయ్యేలా పని చేసి, నేడు విజయ పతాకాన్ని ఎగుర వేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ లీడర్స్ భారీ మెజారిటీతో గెలుపుని సొంతం చేసుకుంటున్నారు.
ఇక ఈ గెలుపులో కీలక పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ కి ప్రతి ఒక్కరు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇన్నాళ్లు ఎన్నో అవమానాలు, కష్టాలు ఎదుర్కొన్న పవన్.. నేడు విజయభేరి మోగిస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్.. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఇక ఈ గెలుపుతో జనసైనికులు, మెగా అభిమానులు మరియు కుటుంబ సభ్యులు సంబర పడుతున్నారు.
పవన్ గెలుపు పై ట్వీట్స్ చేస్తూ తమ ఆనందాన్ని తెలియజేస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే పవన్ మాజీ భార్య రేణూదేశాయ్ సైతం ఒక పోస్ట్ వేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ లో కూతురు ఆద్య టీ గ్లాస్ పట్టుకున్న వీడియోని షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు.. “ఈ గెలుపుతో ఆద్య అండ్ అకిరా ఎంతో సంతోష పడుతున్నారు. అలాగే ఏపీ ప్రజలు కూడా ఈ గెలుపుతో లబ్ది పొందుతారని నేను ఆశిస్తున్నాను” అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఇది ఇలా ఉంటే, అకిరా పవన్ గెలుపుని దగ్గరుండి ఎంజాయ్ చేస్తున్నాడు. పవన్ ప్రస్తుతం తన మూడో భార్య అన్నా లెజినోవాతో నివసిస్తున్న సంగతి తెలిసిందే. అకిరా అక్కడికే వచ్చి తన తండ్రి విజయాన్ని, పిన్ని అన్నా లెజినోవాతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Also read : Pawan Kalyan : పవన్ ఇంట విజయ సంబరాలు.. కొడుకు అకిరా వీడియో వైరల్..