Pawan Kalyan : పవన్ ఇంట విజయ సంబరాలు.. కొడుకు అకిరా వీడియో వైరల్..
పవన్ ఇంట విజయ సంబరాలు. పిన్ని అన్నా లెజినోవాతో కలిసి కొడుకు అకిరా వీడియో వైరల్.
- By News Desk Published Date - 04:40 PM, Tue - 4 June 24
![Pawan Kalyan : పవన్ ఇంట విజయ సంబరాలు.. కొడుకు అకిరా వీడియో వైరల్..](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Pawan-Kalyan-Wife-Anna-Lezhneva-Akira-Nandan-janasena-winning-celebrations.jpg)
Pawan Kalyan : పదేళ్ల ఆశయం, ఐదేళ్ల నిరీక్షణ నేడు నిజమైంది. జనసైనికులు, మెగా అభిమానులు ఎదురు చూసిన ఆ మధుర క్షణం కళ్ళ ముందుకు వచ్చింది. ఎంతో ఉత్కంఠగా సాగిన ఏపీ ఎన్నికల్లో.. కూటమి ప్రభుత్వం భారీ మెజారిటీతో గెలుపొందింది. ముఖ్యంగా ఈ కూటమిలో జనసేన పార్టీ ఎంతో ప్రభావం చూపించింది. యువతని ఆకర్షించిన పవన్ అత్యధిక పోలింగ్ జరిగేలా చేసారు. ఓటు చీలకుండా, షేరింగ్ అయ్యేలా మంచి ప్లానింగ్ తో ముందు నడిచి, విజయ పతాకాన్ని ఎగుర వేశారు.
గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయి తీవ్ర అవమానాన్ని ఎదుర్కొన్న పవన్ కళ్యాణ్.. ఈ ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. ఆయన మాత్రమే కాదు, ఆయనతో పాటు పోటీ చేసిన ఇతర ఎమ్మెల్యే, ఎంపీలను కూడా మంచి మెజారిటీతో గెలిపించుకున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి. పదేళ్ల నుంచి ఎదురు చూస్తున్న కల నిజమవ్వడంతో జనసైనికులు, మెగా అభిమానులు.. సంతోషంలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.
ఇక పవన్ గెలుపుతో మెగా ఇంట కూడా సంబరాలు మొదలయ్యాయి. పవన్ సతీమణి అన్నా లెజినోవా.. పవన్ కి విజయ తిలకం దిద్ది హారతు ఇచ్చిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో పవన్ మాజీ భార్య కుమారుడు అకిరా నందన్ కూడా కనిపించడం గమనార్హం. తండ్రి విజయం అకిరా కళ్ళలో కనిపిస్తుంది. పవన్ కి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం అభిమానులు ఇంటికి చేరుకోగా.. అన్నా లెజినోవాతో కలిసి అకిరా కూడా బయటకి వచ్చి అభివాదం చేసారు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
Anna Lezhneva madam and #AkiraNandan at @PawanKalyan ‘s residence in Hyderabad
pic.twitter.com/wYUXEY1sfj— Mañøj Řøćķzz (@Manojrockzz15) June 4, 2024
Ah corgo pants
Ah styling 🔥🔥 #AkiraNandanpic.twitter.com/lu8l8sWrMQ— Nithin (@NithinPSPKCult) June 4, 2024
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![AP Deputy CM Pawan: పిల్లాడి కోసం కాన్వాయ్ ఆపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. వీడియో వైరల్!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/07/safeimagekit-safeimagekit-Screenshot-2024-07-03-130915_11zon.png)
AP Deputy CM Pawan: పిల్లాడి కోసం కాన్వాయ్ ఆపిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్.. వీడియో వైరల్!
AP Deputy CM Pawan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. కూటమి ప్రభుత్వంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సీఎంగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా (AP Deputy CM Pawan) బాధ్యతలు చేపట్టారు. అయితే డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న పవన్ తన స్టైల్లో పరిపాలన చేస్తున్నారు. ముఖ్యంగా తనకు కేటాయించిన శాఖలపై అధికారులతో సమీక్షలు జరుపుతున్నారు. అంతేకాకుండా ఆ శాఖలకు �