Renu Desai : మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టిన రేణు దేశాయ్.. ఏ సినిమా కోసమో..
ఇటీవల రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్.
- By News Desk Published Date - 04:18 PM, Mon - 14 October 24

Renu Desai : పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ చాలా ఏళ్ళ క్రితం సినిమాలకు దూరమైంది. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు, అభిమానులకు దగ్గరగానే ఉంది. ఇటీవల రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో సినిమాల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చింది రేణు దేశాయ్. ఆ సినిమా ప్రమోషన్స్ లో మంచి పాత్రలు వస్తే మళ్ళీ సినిమాలు చేస్తానని, జాగ్రత్తగా పాత్రలు ఎంచుకుంటాను అని తెలిపింది.
అయితే టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా అనౌన్స్ చేయలేదు రేణు దేశాయ్. తాజాగా నేడు ఉదయం రేణు దేశాయ్.. సంవత్సరం తర్వాత మళ్ళీ షూటింగ్ లో పాల్గొంటున్నాను అంటూ కారవాన్ లో చిన్న వీడియో తీసుకొని తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అయితే అది ఏ సినిమా అనే డీటెయిల్స్ ప్రకటించలేదు.
దీంతో రేణు దేశాయ్ పోస్ట్ వైరల్ అవ్వగా అభిమానులు, నెటిజన్లు ఏ సినిమాల్లో నటిస్తున్నారు అంటూ ఆమెని ప్రశ్నిస్తున్నారు. మరి త్వరలో రేణు దేశాయ్ ఎలాంటి పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తుందో చూడాలి. ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటూ రేణు దేశాయ్ తన పిల్లల గురించి, జంతువుల గురించి పోస్టులు పెడుతూ ఉంటుంది.
Also Read : Vijay Devarakonda : విజయ్ దేవరకొండ గౌతమ్ తిన్ననూరి .. మరో K.G.F..!