Renu Desai : అధ్య కోసమే మరో పెళ్లి చేసుకోలేదు – రేణు దేశాయ్
నాకు రైట్ పర్సన్ అనిపించిన వ్యక్తిని పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంగీకారంతోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా. కానీ ఆ తరువాత.. పిల్లలున్నారు.
- Author : Sudheer
Date : 17-10-2023 - 8:48 IST
Published By : Hashtagu Telugu Desk
రేణు దేశాయ్ (Renu Desai)..గత వారం రోజులుగా మీడియా లో తెగ వైరల్ గా మారింది. చాల ఏళ్ల తర్వాత చిత్రసీమలోకి టైగర్ నాగేశ్వర్ రావు (Tiger Nageswara Rao ) తో రీ ఎంట్రీ ఇస్తుంది. వంశీ డైరెక్షన్లో రవితేజ (Raviteja) హీరోగా తెరకెక్కిన ఈ మూవీ ఈ నెల 20 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో ఆమె వరుస ఇంటర్వూస్ తో బిజీ గా మారింది. సినిమా విశేషాలతో పాటు తన పర్సనల్ లైఫ్ కు సంబదించిన విశేషాలను కూడా పంచుకుంటుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో తాను రెండో వివాహం (Renu Desai 2nd Marriage) రద్దు గురించి తెలిపింది. నాకు రైట్ పర్సన్ అనిపించిన వ్యక్తిని పెద్దల అంగీకారంతోనే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంగీకారంతోనే ఎంగేజ్‌మెంట్ చేసుకున్నా. కానీ ఆ తరువాత.. పిల్లలున్నారు.. వాళ్లకి తోడుగా ఉండాలి.. నువ్వు ఎలా ఉంటావ్.. అదీ ఇదీ అని నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అన్నారు. అప్పటికే నేను ఎంగేజ్‌మెంట్ చేసుకున్నాను.. ఫొటోస్ కూడా బయటకు వచ్చాయి. అయినప్పటికీ కాస్త ఆలోచనలో పడ్డాను. నా కూతురు (Adhya) వయసు కేవలం ఏడేళ్లు అప్పటికి. నేను పెళ్లి చేసుకున్నాక.. ఎంతైనా అతనికి కొంత సమయం ఇవ్వాలి. కాబట్టి అప్పుడు నేను నా కూతురు కోసం ఆలోచించాను. ప్రస్తుతం నా కూతురు వయసు 13 ఏళ్లు. ఆధ్య కాలేజ్‌కి వెళ్లిన తరువాత నా గురించి నేను ఆలోచిస్తాను. నేను పెళ్లి చేసుకోవడం నా పిల్లలకు ఇష్టమే. వాళ్లు హ్యాపీగానే ఉన్నారు. ఒక వ్యక్తి వల్ల నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావ్ అంటే.. హ్యాపీగా పెళ్లి చేసుకో మమ్మీ అని నా కొడుకు అకిరా నందన్ (Akira) అన్నాడు. మా మధ్య నా పెళ్లి గురించి మాట్లాడుకుంటాం.. నా కొడుకు ఎప్పుడూ పెళ్లి చేసుకోమనే చెప్తాడు. నీకు ఒక వ్యక్తి నచ్చితే.. అతనితో నువ్వు హ్యాపీగా ఉంటానంటే పెళ్లి చేసుకో మమ్మీ అని చాలాసార్లు చెప్పాడు. కానీ వాళ్లకి టైం ఇవ్వాలని పెళ్లిని కొన్నాళ్లు దూరం పెట్టాను అని రేణు క్లారిటీ ఇచ్చింది.
Read Also : Telangana: చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి అవమాన పడ్డాను: CM KCR