Viral : కృతి సనన్‌తో ప్రభాస్ డేటింగ్..?
కృతి సనన్, ప్రభాస్ జంటగా ఆదిపురుష్ మూవీలో కనిపించనున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 2023లో విడుదల కానుంది.
- Author : hashtagu
Date : 18-09-2022 - 9:14 IST
Published By : Hashtagu Telugu Desk
కృతి సనన్, ప్రభాస్ జంటగా ఆదిపురుష్ మూవీలో కనిపించనున్న సంగతి తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా జనవరి 2023లో విడుదల కానుంది. ఇదిలా ఉంటే, ప్రభాస్ కృతి సనన్ తో డేటింగ్ చేస్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆదిపురుష్ సినిమా నుంచి వీరిద్దరి మధ్య స్నేహం చిగురించిందని…అది కాస్త డేటింగ్ వరకు వెళ్లిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ముంబైలో కలిసి ఉంటున్నారన్న పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే వీరి డేటింగ్ వార్తలపై అధికారికంగా వారి నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇది ఉంటే ప్రభాస్, కృతి సనన్ ఒకరినొకరు ఇష్టపడ్డారనే టాక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ప్రభాస్ అభిమానులు కూడా స్పందిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తయి.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కాఫీ విత్ కరణ్ షోలో కృతి సనన్ ప్రభాస్ గురించి మాట్లాడటం ఈ రూమర్స్ కు మరింత బలాన్ని ఇస్తున్నాయి. షోలో ఆమె ప్రభాస్‌కు ఫోన్ చేసింది. కృతి సనన్ ఫోన్ వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడాడు ప్రభాస్. మొత్తానికి వీరిద్దరి మధ్య డేటింగ్ చాలా స్పీడ్ గా ఉందన్న రూమర్స్ మాత్రం వస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాల్సిందే.
.@kritisanon called #Prabhas in koffee with Karan show 🤩👌pic.twitter.com/Cwt7eOjpxK
— Nizam REBEL'lions ™ (@NizamPrabhasFC) September 1, 2022