Raviteja : అందరినీ నేను సాటిస్ఫై చేయలేను.. వాళ్లకు పంచ్ వేసిన మాస్ రాజా..!
మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) రీసెంట్ మూవీ ఏగల్ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ మార్క్ వసూళ్లతో ఈ సినిమా రన్ అవుతుంది. రవితేజ ఈగల్ సినిమాకు రివ్యూస్ నెగిటివ్
- By Ramesh Published Date - 12:51 PM, Fri - 16 February 24

మాస్ మహారాజ్ రవితేజ (Raviteja) రీసెంట్ మూవీ ఏగల్ సినిమా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రవితేజ మార్క్ వసూళ్లతో ఈ సినిమా రన్ అవుతుంది. రవితేజ ఈగల్ సినిమాకు రివ్యూస్ నెగిటివ్ గా వచ్చాయి. అయితే రివ్యూస్ తో సంబంధం లేకుండా సినిమా వసూళ్లు రాబడుతుంది. లేటెస్ట్ ఇంటర్వ్యూ లో రవితేజ ఈ విషయంపై స్పందించారు. అందరినీ సాటిస్ఫై చేయలేను కదా అన్నారు రవితేజ.
రవితేజ రివ్యూస్ ఉద్దేశించే ఈ కామెంట్ చేసి ఉంటారని చెప్పొచ్చు. సినిమాను ఎవరు ఎలా చూస్తారన్నది వారి పర్సనల్ ఒపీనియన్. అయితే రవితేజ మాత్రం తన సినిమా గురించి ఎవరేం అనుకున్నా తను బాధ పడనని అంటున్నారు. ఆడియన్స్ తన సినిమా ఫలితాన్ని డిసైడ్ చేస్తారని బలంగా నమ్ముతున్నారు రవితేజ.
ఈగల్ కమర్షియల్ గా వర్క్ అవుట్ అయ్యేలానే ఉంది. కార్తీక్ ఘట్టమనేని ఈగల్ 2 సినిమాను కూడా ప్లాన్ చేశారు. ఈగల్ ఫస్ట్ పార్ట్ చివర్లో పార్ట్ 1 ఈఅగల్ యుద్ధ కాండ అని షాక్ ఇచ్చారు. ఈగల్ సినిమాలో రవితేజ తో కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ కలిసి నటించారు. సినిమాకు దేవ్జాండ్ మ్యూజిక్ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించింది.