Mr Bacchan Trailer Talk : మిస్టర్ బచ్చన్ ట్రైలర్ టాక్.. మాసు క్లాసు అన్ని కలిపి కొట్టేశారు..!
హరీష్ శంకర్ టేకింగ్, రవితేజ (Raviteja) మాస్ మేనియాతో పాటుగా భాగ్య శ్రీ (Bhagya Sri) బోర్స్ అందాలు కూడా హైలెట్ అయ్యేలా ఉన్నాయి.
- By Ramesh Published Date - 07:41 PM, Wed - 7 August 24

Mr Bacchan Trailer మాస్ మహరాజ్ రవితేజ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో క్రేజీ మూవీగా వస్తుంది మిస్టర్ బచ్చన్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా రైడ్ కథా స్పూర్తితో పూర్తిగా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వస్తుంది. ఆగష్టు 15న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఆల్రెడీ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచగా లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మించేలా చేసింది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే కథ కథనాలు ఎలా ఉన్నా ట్రైలర్ కట్ అదిరిపోయింది. మాస్ క్లాస్ అన్న తేడా లేకుండా ఆడియన్స్ అందరినీ మెప్పించేలా ఉంది ఈ సినిమా. హరీష్ శంకర్ టేకింగ్, రవితేజ (Raviteja) మాస్ మేనియాతో పాటుగా భాగ్య శ్రీ (Bhagya Sri) బోర్స్ అందాలు కూడా హైలెట్ అయ్యేలా ఉన్నాయి. ఇక మిక్కి జే మేయర్ మ్యూజిక్ కూడా సినిమాపై ఇంపాక్ట్ చూపించేలా ఉంది.
Also Read : NTR-Allu Arjun : ఒకే వేదికపై అల్లు అర్జున్ – ఎన్టీఆర్ లు ..?
ట్రైలర్ ఇంప్రెస్ అనిపించగా కచ్చితంగా మాస్ రాజా మరోసారి బాక్సాఫీస్ స్టామినా చూపించేలా ఉందని చెప్పొచ్చు. ధమాకా తర్వాత రవితేజ ఖాతాలో హిట్ పడలేదు. వాల్తేరు వీరయ్య సక్సెస్ అయినా అది మెగాస్టార్ ఖాతాలో పడింది. అందుకే మిస్టర్ బచ్చన్ తో మాస్ రాజా భారీ టార్గెట్ పెట్టుకున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్ కాబట్టి సినిమా తప్పకుండా అనుకున్న విధంగా ఉంటుందని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు.
రిలీజైన ట్రైలర్ కూడా సినిమాపై హైప్ ని మరింత పెంచుతుంది. సో ఆగష్టు 15న థియేటర్ లో మాస్ రాజా ఫ్యాన్స్ అందరికీ మాస్ ఫీస్ట్ పక్కా అని చెప్పొచ్చు. ఈ సినిమాకు పోటీగా అదే రోజు పూరీ డబుల్ ఇస్మార్ట్ కూడా వస్తుంది. రవితేజ, రామ్ ఫైట్ లో ఎవరు గెలుస్తారన్నది చూడాలి.