Tiger Nageswara Rao: రవితేజ మాస్ ట్రీట్, టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ డేట్ ఫిక్స్
మాస్ మహారాజా రవితేజ "టైగర్ నాగేశ్వరరావు"తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
- By Balu J Published Date - 05:55 PM, Sat - 12 August 23
మాస్ మహారాజా రవితేజ “టైగర్ నాగేశ్వరరావు”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సాలిడ్ హైప్ ఉన్న ఈ చిత్రానికి దర్శకుడు వంశీ దర్శకత్వం వహిస్తుండగా, క్రేజీ అప్డేట్ ఇస్తున్నట్లు మేకర్స్ ధృవీకరించారు. ఇక ఇప్పుడు ఈ బిగ్ అప్ డేట్ ని రివీల్ చేస్తూ ఆగస్ట్ 17న దండయాత్ర అనే పోస్టర్ తో రిలీజ్ చేయనున్నట్టు టైగర్ నాగేశ్వరరావు మేకర్స్ తెలిపారు.
దీంతో వచ్చే వారం నుంచి ఈ సినిమా నుంచి భారీ ట్రీట్ ప్రారంభం కానుందని చెప్పాలి. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తుండగా బాలీవుడ్ హీరోయిన్ నాపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే పలువురు అగ్రనటులు ప్రధాన పాత్రలు పోషిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తోంది. అలాగే అక్టోబర్ 20న గ్రాండ్ పాన్ ఇండియా రిలీజ్ గా ఫిక్స్ చేశారు.
(Ravi Teja) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫ్యాన్స్, ఆడియెన్స్ ను అలరిస్తున్నారు. సరికొత్త ప్రాజెక్ట్స్ తో యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దుమ్ములేపుతున్నారు. ఇటీవల వరుసగా హిట్లు అందుకుంటూ మాస్ సత్తా చూపిస్తున్నారు. చివరిగా ‘వాల్తేరు వీరయ్య’తో అలరించారు. ఆ తర్వాత క్రైమ్ బేస్డ్ మూవీ ‘రావణసుర’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం మాస్ మాహారాజా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియన్ ఫిల్మ్ ‘టైగర్ నాగేశ్వరరావు’తో రాబోతున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై గ్రాండ్ గా రూపుదిద్దుకుంటోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను కూడా పూర్తి చేసింది యూనిట్.
Related News
Nani: హీరో నాని, సుజిత్ మూవీ ఆగిపోయిందా!
Nani: నాన్ థియేట్రికల్ మార్కెట్ పతనం, థియేట్రికల్ రంగంలో హెచ్చుతగ్గులు కొన్ని ప్రాజెక్టులకు పెను ముప్పుగా మారుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు సైన్ చేయగా, అది భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన యాక్షన్ మూవీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం బడ్జెట్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయింది. డ�