Raviteja : సంక్రాంతి బరిలో రవితేజ సినిమా?
Raviteja : రవితేజ నటించిన మరో చిత్రం 'మాస్ జాతర' ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమల సినిమా కూడా రానుండటంతో రవితేజ అభిమానులకు ఇది ఒక మంచి పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది
- By Sudheer Published Date - 07:08 AM, Mon - 8 September 25

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల (Raviteja – Kishor Tirumala) కాంబినేషన్ లో ఓ కొత్త చిత్రం రాబోతుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం జనవరి 13, 2026న థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ చిత్రానికి ‘అనార్కలి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశం ఉంది.
Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ
కిషోర్ తిరుమల గతంలో ‘నేను శైలజ’, ‘చిత్రలహరి’ వంటి విజయవంతమైన చిత్రాలను రూపొందించారు. ఇప్పుడు రవితేజ కలయికలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగా ఉన్నాయి. రవితేజ మాస్ ఇమేజ్, కిషోర్ తిరుమల సెన్సిబుల్ డైరెక్షన్ కలిసి ఈ సినిమాను ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా మారుస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇక రవితేజ నటించిన మరో చిత్రం ‘మాస్ జాతర’ ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో విడుదల కానుంది. ఈ సినిమాతో పాటు కిషోర్ తిరుమల సినిమా కూడా రానుండటంతో రవితేజ అభిమానులకు ఇది ఒక మంచి పండుగ వాతావరణాన్ని తీసుకురానుంది. ఈ రెండు సినిమాలపై పూర్తి సమాచారం త్వరలోనే అధికారికంగా వెలువడే అవకాశం ఉంది.