Ravi Teja: టైగర్ నాగేశ్వర్ రావు ఎఫెక్ట్, సంక్రాంతి బరి నుంచి రవితేజ ఔట్
రవితేజ నటించిన “ఈగల్” వంటి సినిమాలు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని సమాచారం
- By Balu J Published Date - 01:55 PM, Wed - 25 October 23

సంక్రాంతి పండుగకు పలు సినిమాలు విడుదల తేదీలను ప్రకటించడంతో తీవ్ర పోటీ నెలకొంది. అయితే తాజాగా రవితేజ నటించిన “ఈగల్” వంటి సినిమాలు సంక్రాంతి పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయానికి సరైన కారణం ఉంది. దసరా పండుగ సందర్భంగా, రవితేజ తాజా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” మరో రెండు చిత్రాల నుండి గట్టి పోటీని ఎదుర్కొంది, ఫలితంగా తక్కువ కలెక్షన్లు వచ్చాయి.
ముఖ్యంగా ఫస్ట్ వీకె డేస్ లో కూడా అనుకున్న కలెక్షన్స్ సాధించలేకపోయింది. దీంతో మాస్ హీరో రవితేజ ఈసారి కూడా అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలని రవితేజ భావిస్తున్నాడు. సంక్రాంతి పండుగ స్లాట్ కోసం నాలుగు సినిమాలు పోటీ పడుతుంటే “ఈగల్”ని జనవరి 26 లేదా ఫిబ్రవరికి రీషెడ్యూల్ చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రస్తుతం రవితేజ మార్కెట్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఒక్క బ్లాక్‌బస్టర్ హిట్ అవసరం.
Also Read: Ponnala Lakshmaiah: బీఆర్ఎస్ లో పొన్నాల ఉక్కిరిబిక్కిరి, కాంగ్రెస్ గూటికి మాజీ పీసీసీ చీఫ్?