Rashmika : రష్మిక కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్
Rashmika : ఇటీవలే ఆమె జిమ్లో వ్యాయామం చేస్తుండగా కాలు బెనికిందని స్వయంగా ఆమెనే తెలిపింది
- By Sudheer Published Date - 10:15 AM, Sun - 26 January 25

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక (Rashmika) మందన్న రీసెంట్ గా వీల్ చైర్లో (Wheelchair) కనిపించడం అభిమానులను షాక్ కు గురి చేసిన సంగతి తెలిసిందే. శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఆమె నడవలేని స్థితిలో ఉండటంతో వీల్చైర్లో తీసుకెళ్లారు. ఇటీవలే ఆమె జిమ్లో వ్యాయామం చేస్తుండగా కాలు బెనికిందని స్వయంగా ఆమెనే తెలిపింది. ఆ గాయం నుంచి కోలుకునేందుకు నెలలు కూడా పట్టొచ్చేమో అని ఆమె ఇన్స్టాలో పోస్ట్ కూడా చేసింది. అయితే ఇది చూసి ఏముందిలే త్వరగానే సెట్ అవుతుందని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ తాజాగా తన కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ జరిగినట్లు తెలిపి అభిమానుల్లో ఆందోళన పెంచింది.
Gold Price Today : రికార్డు స్థాయిలో కొనసాగుతున్న ధరలు..!
తన కాలికి మూడు చోట్ల ఫ్రాక్చర్ అవ్వడమే కాదు కండరాల్లో చీలిక కూడా వచ్చినట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘2 వారాలుగా కనీసం నడవలేకపోతున్నా. ఎక్కడికి వెళ్లినా ఒంటి కాలిపైనే వెళ్తున్నా. నాపై మీరు చూపించే ప్రేమ, అభిమానం వల్లే నాకు ఈ నొప్పి తెలియడం లేదు. నాకు మద్దతుగా నిలిచినవారికి రుణపడి ఉంటా’ అని పేర్కొంది. ఇటీవల పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రష్మిక..ప్రస్తుతం ఛావా మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ (Chhatrapati Sambhaji Maharaj ) జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఛావా’ (Chhaava) లో నటిస్తుంది. శంభాజీ మహారాజ్ విక్కీ కౌశల్ , ఆయన భార్యగా రష్మిక (Rashmika Mandanna) ఈ మూవీ లో నటిస్తుంది. లక్ష్మణ్ ఉటేకర్ (Laxman Utekar) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 14న థియేటర్లలోకి రానుంది. మంగళవారం రష్మిక లుక్ ను మూవీ టీమ్ విడుదల చేసింది. మహారాణిలా ఉన్న రష్మిక లుక్ ఆకట్టుకుంటోంది. ఈ లుక్ పై.. రష్మిక మందన్న ఇన్ స్టాలో పోస్ట్ చేసి.. ప్రతి గొప్ప రాజు వెనుకాల.. యోధురాలైన భార్య ఉంటుందని కామెంట్ జతచేశారు. ఈ లుక్ చూసిన నేషనల్ క్రష్ అభిమానులు ఫిదా అయ్యారు.