Rashmika Mandanna : ఇంతకీ రష్మిక ఎవరి గర్ల్ ఫ్రెండ్..?
Rashmika Mandanna కన్నడ భామ రష్మిక మందన్న బాలీవుడ్ లో యానిమల్ సినిమా చేస్తూనే మరోపక్క పుష్ప 2 లో కూడా నటిస్తుంది.
- Author : Ramesh
Date : 23-10-2023 - 11:43 IST
Published By : Hashtagu Telugu Desk
Rashmika Mandanna కన్నడ భామ రష్మిక మందన్న బాలీవుడ్ లో యానిమల్ సినిమా చేస్తూనే మరోపక్క పుష్ప 2 లో కూడా నటిస్తుంది. ఈ సినిమాలతో పాటు రెయిన్ బో అనే ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమాకు సైన్ చేసింది. ఇక లేటెస్ట్ గా మరో మూవీ ఓకే చేసింది అమ్మడు. చిలసౌ ఫేమ్ రాహుల్ రవింద్రన్ (Rahul Ravindran) డైరెక్షన్ లో రష్మిక లీడ్ రోల్ లో ఒక సినిమా వస్తుంది. ఈ సినిమాకు సంబందించిన ఒక టీజర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు. రష్మిక మందన్న కొత్త సినిమా టైటిల్ ది గర్ల్ ఫ్రెండ్ (The Girl Friend) టీజర్ రిలీజైంది.
ఈ టీజర్ చూస్తే రష్మిక (Rashmika) ఈ సినిమాలో బలమైన పాత్ర చేస్తున్నట్టు ఉంది. అయితే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి రష్మికని చూపించారు సరే మరి ఈ సినిమాలో హీరో ఎవరన్నది తెలియాల్సి ఉంది. హీరోని రివీల్ చేయకుండా కేవలం హీరోయిన్ తోనే టీజర్ రిలీజ్ చేశారు. దీన్నిబట్టే చెప్పొచ్చు ఈ సినిమా ఫీమేల్ సెంట్రిక్ సినిమాగా వస్తుందని.
Also Read : Bigg Boss 7 : రెండు వారాలకు పూజా రెమ్యునరేషన్ ఎంతంటే..?
ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రష్మిక కెరీర్ లో సంథింగ్ స్పెషల్ మూవీ కానుంది. చిలసౌ సినిమాతో డైరెక్టర్ గా తన సత్తా చాటిన రాహుల్ రవింద్రన్ నెక్స్ట్ నాగార్జునతో మన్మథుడు 2 (Manmathudu 2) చేయగా అది డిజాస్టర్ అయ్యింది. అయితే ఆ షాక్ నుంచి కోలుకుని ఇన్నాళ్లకు మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్నాడు. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నిర్మించడం విశేషం.
రష్మిక మందన్న ఎవరి గర్ల్ ఫ్రెండ్.. ఈ సినిమాలో హీరో ఎవరన్న కన్ ఫ్యూజన్ కి ఎప్పుడు తెర పడుతుందో చూడాలి. రష్మిక మందన్న సినిమాల లైనప్ చూస్తుంటే మళ్లీ అమ్మడు తిరిగి ఫాం లోకి వచ్చేలా ఉందని చెప్పొచ్చు.