Valentine’s Day Gift : రష్మిక కు విజయ్ ఇచ్చింది అదేనా..?
Valentine's Day Gift : రోజ్ ఫ్లవర్ బొకేను ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఆమె 'నా ముఖంపై చిరునవ్వు ఎలా తెప్పించాలో నీకు బాగా తెలుసు పాపలు అని క్యాప్షన్ ఇచ్చారు
- By Sudheer Published Date - 02:55 PM, Tue - 18 February 25

విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), రష్మిక(Rashmika Mandanna) మధ్య ఏదో ఉందని ఎప్పట్నుంచో రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గతంలో వీరు దీనిపై స్పందిస్తూ ఇద్దరం మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అంతే.. అంతకు మించి ఏం లేదు అని చెప్పారు. కానీ రష్మిక, విజయ్ ఇద్దరు కలిసి తిరగడం , జిమ్ లలో కలిసి వర్కౌట్స్ చేయడం , కలిసి విదేశాల్లో చక్కర్లు కొట్టడం ఇవన్నీ ఎప్పటికప్పుడు బయటకు వస్తూ వీరిమధ్య స్నేహం కాదు ప్రేమ అని చెప్పకనే చెపుతుంటాయి.
CBN : చంద్రబాబు అస్సలు తట్టుకోలేడు – జగన్
విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్స్ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. రోజ్ ఫ్లవర్ బొకేను ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసిన ఆమె ‘నా ముఖంపై చిరునవ్వు ఎలా తెప్పించాలో నీకు బాగా తెలుసు పాపలు అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆ బొకే విజయ్ దేవరకొండ నే పంపించి ఉంటారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఇటీవల విజయ్ ‘కింగ్ డమ్’ టైటిల్ అనౌన్స్మెంట్ సమయంలో రష్మిక అతడిని పొగుడుతూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే రష్మిక నటించిన ఛావా ట్రైలర్ కు కూడా విజయ్ పాజిటివ్ కామెంట్స్ ఇచ్చి సినిమా విజయంలో భాగం అయ్యాడు. ఇలా ఎప్పటికప్పుడు ఇరువురి సినిమాలకు సపోర్ట్ ఇచ్చుకుంటూ వారి మధ్య ఉన్న ప్రేమను చెప్పకనే చెపుతూ వస్తున్నారు. మరి వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకొని ఒకటి అవుతారో…ఈ దాగుడు మూతలకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.