Rashmika Mandanna : రష్మిక తొలి ఆడిషన్ వీడియో చూశారా..?
Rashmika Mandanna రష్మిక తొలి సినిమా కన్నడలో కిరిక్ పార్టీ. ఆ సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే రష్మిక ఆ సినిమా నటించే టైం లో ఆమెకు 19 ఏళ్లు
- By Ramesh Published Date - 11:54 AM, Mon - 7 October 24
కన్నడ భామ రష్మిక మందన్న ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ, కన్నడలో మాత్రమే కాదు హిందీలో కూడా వరుస ఛాన్సులు అందుకుంటుంది అమ్మడు. ఐతే రష్మిక తొలి సినిమా కన్నడలో కిరిక్ పార్టీ. ఆ సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఐతే రష్మిక ఆ సినిమా నటించే టైం లో ఆమెకు 19 ఏళ్లు మాత్రమే అని తెలుస్తుంది.
అంతేకాదు రష్మిక (Rashmika Mandanna) ఆ సినిమా ఆడిషన్ ఇచ్చిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీ.ఏ సెకండ్ ఇయర్ చదువుతున్న టైం లో రష్మిక సినిమా ఆడిషన్ ఇచ్చిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో రష్మిక చాలా బబ్లీగా ఉంది. అంతేకాదు ఎలాంటి బెరుకు లేకుండా తన గురించి తాను చెప్పుకుంది.
తెలుగులో ఛలో సినిమాతో..
కిరిక్ పార్టీ తర్వాత తెలుగులో ఛలో సినిమాతో ఛాన్స్ అందుకుంది రష్మిక. ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చాయి. వరుస స్టార్ ఛాన్సులతో అమ్మడు సూపర్ పాపులారిటీ తెచ్చుకుంది. రష్మిక మందన్న ప్రస్తుతం కుబేర, పుష్ప 2 సినిమాల్లో నటిస్తుంది. బాలీవుడ్ లో కూడా ఛావా సినిమాలో నటిస్తుంది.
నేషనల్ క్రష్ గా రష్మిక తన పాపులారిటీ కొనసాగిస్తుండగా అమ్మడి ఆడిషన్ వీడియో ( Rashmika Audition Video) బయటకు రావడంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఇంకెందుకు ఆలస్యం రష్మిక ఆడిషన్ ఎలా ఇచ్చిందో మీరు ఒక లుక్కేయండి.
🌝❤#RashmikaMandanna #Pushpa2TheRule pic.twitter.com/3zfgJviViF
— S R E E | ಶ್ರೀ ✨ (@SreeDharaNEL) October 3, 2024