Rashmika Failed: బాలీవుడ్ లో రష్మిక మందన్న ఫెయిల్.. ఆశలన్నీ టాలీవుడ్ పైనే!
రష్మిక మందన్నా ఇప్పుడు చాలామందికి నేషనల్ క్రష్ గా మారిపోయింది.
- By Balu J Published Date - 10:23 AM, Wed - 22 March 23
ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన రష్మిక మందన్నా ఇప్పుడు చాలామందికి నేషనల్ క్రష్ గా మారిపోయింది. పుష్ప మూవీతో ఈ బ్యూటీకి ఫుల్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేసే రష్మిక కు గుర్తింపు కూడా ఆస్తాయిలో ఉంది. అయితే ఈ ముద్దుగుమ్మ తెలుగులో సక్సెస్ అయినట్టుగా బాలీవుడ్ లో సక్సెస్ కాలేకపోయింది. ఇటీవల ఆమె చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా ఫెయిల్ అయ్యాయి కూడా.
పుష్ప భారీ విజయం తర్వాత బాలీవుడ్ తొలి చిత్రం గుడ్‌బై ప్రేక్షకుల ఆకట్టుకోవడంలో ఘోరంగా ఫెయిల్ అయ్యింది. ఆ మూవీ ఫ్లాప్ అయింది. ఇక దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్, వికాస్ బహల్ వంటి ప్రముఖ దర్శకుడు ఉన్నప్పటికీ, ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. మరోవైపు రష్మిక ఒక్క పరాజయంతో నిరుత్సాహపడలేదు. సౌత్ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తూనే ఉంది. ఆమెకు తెలుగు మరియు కన్నడ సినిమాల్లో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. చాలా కాలం తర్వాత ఓ తెలుగు సినిమాకు సైన్ కూడా చేసింది.
ఇక రష్మిక ఖాతాలో గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు, పుష్ప లాంటి హిట్ సినిమాలున్నాయి. పుష్ప లోని సామి సామి పాట అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ను ఓ ఊపు ఉపేసింది కూడా. దీంతో ఈ రష్మికకు బాలీవుడ్ అవకాశాలు వెల్లువెత్తాయి. ప్ర్తస్తుతం పుష్ప 2 సీక్వెల్‌తో బిజీగా ఉన్న రష్మిక భీష్మతో తనకు విజయాన్ని అందించిన బృందంలో కలిసి మరో సినిమా చేయబోతోంది. బాలీవుడ్లో పరాజయం పాలైన ఈ భామ మళ్లీ టాలీవుడ్‌కి విజయాన్ని కొట్టాలని భావిస్తోంది.
Related News
Pushpa 2 : పుష్ప పుష్ప సాంగ్ ప్రోమో.. రూల్ చేసేందుకు రెడీ..!
Pushpa 2 పుష్ప 2 నుంచి రీసెంట్ గా ఒక టీజర్ రిలీజ్ కాగా ఇప్పుడు పుష్ప 2 నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో రిలీజైంది. పుష్ప పుష్ప అంటూ సాగే ఈ సాంగ్ సినిమాలో కూడా ఫస్ట్ సాంగ్ గా ఉండబోతుందని చెప్పొచ్చు.