Rashmika Mandanna : రష్మిక హోలీ ఎవరితో సెలబ్రేట్ చేసుకుందో తెలుసా..?
Rashmika Mandanna పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న ఓ పక్క సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే మరోపక్క తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కి రెగ్యులర్ టచ్ లో ఉంటుంది. యానిమల్ తో నేషనల్ వైడ్ గా
- By Ramesh Published Date - 11:59 AM, Tue - 26 March 24

Rashmika Mandanna పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న ఓ పక్క సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే మరోపక్క తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కి రెగ్యులర్ టచ్ లో ఉంటుంది. యానిమల్ తో నేషనల్ వైడ్ గా తన పాపులారిటీ మరింత పెంచుకున్న రష్మిక త్వరలో రాబోతున్న పుష్ప 2 తో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తుంది.
సోమవారం జరిగిన హోలీ వేడుకల్లో తన టీం తో కలిసి సెలబ్రేట్ చేసుకుంది రష్మిక మందన్న. తన టీం అందరితో కలిసి హోలీ జరుపుకున్నానని టీం తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది రష్మిక.
అంతేకాదు ప్రేక్షకులందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలిపింది. రష్మిక పుష్ప 2 తో పాటుగా ధనుష్ కుబేర సినిమాలో కూడా నటిస్తుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటిస్తున్న ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నాడు. వీటితో పాటుగా రష్మిక గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో సినిమాలను కూడా చేస్తుంది.
విజయ్ దేవరకొండతో రష్మిక కలిసి నటిస్తే చూడాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు. రౌడీ హీరోతో రష్మిక రిలేషన్ లో ఉందని అందరు చెప్పుకునే మ్యాటరే కానీ రష్మిక ఈ విషయంపై ఎప్పుడు స్పందించలేదు. విజయ్ కూడా తనతో రష్మికని లింక్ పెడుతూ వచ్చిన వార్తలపై సైలెంట్ గా ఉంటున్నాడు.
Also Read : Prabhas Raja Saab : రాజా సాబ్ కోసం 4 రోజుల్లో 4 కోట్లు.. ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టే..!