Vijay Devarakonda : విజయ్ హీరోయిన్ రేసులో రష్మిక కూడానా.. విడి 12 ఈ సస్పెన్స్ వీడేది ఎప్పుడు..?
Vijay Devarakonda ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో రాబోతుందని తెలుస్తుంది. విడి 12వ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్
- By Ramesh Published Date - 01:41 PM, Mon - 19 February 24

Vijay Devarakonda ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ చేస్తున్న సినిమా గౌతం తిన్ననూరి డైరెక్షన్ లో రాబోతుందని తెలుస్తుంది. విడి 12వ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యున్ ఫోర్ బ్యానర్ లో నిర్మిస్తున్నారు. సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. స్పై థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బడ్జెట్ తో వస్తుందని తెలుస్తుంది.
ఈ సినిమాలో హీరోయిన్స్ గా యానిమల్ తృప్తి డిమ్రి, సప్త సాగరాలు దాటి రుక్మిణి వసంత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని టాక్. ఆ ఇద్దరిలో ఒకరు కన్ ఫర్మ్ కాగా మరొకరు ఎవరన్నది తెలియాల్సి ఉంది. అయితే లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ సినిమా రేసులో రష్మిక మందన్న కూడా ఉన్నట్టు తెలుస్తుంది. విజయ్ రష్మిక ఇద్దరు కలిసి చేసిన గీతా గోవిందం సూపర్ హిట్ కాగా సెకండ్ అటెంప్ట్ గా చేసిన డియర్ కామ్రేడ్ ఫ్లాప్ అయ్యింది.
మళ్లీ ఇద్దరు కలిసి చేసే సినిమా కోసం ఆ ఇద్దరి ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. గౌతం తిన్ననూరి సినిమాలో విజయ్ తో రష్మిక స్క్రీన్ షేర్ చేసుకుంటుందని టాక్. అదే నిజమైతే మాత్రం ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పొచ్చు. విజయ్ తో రష్మిక కలిసి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఉంది.
Also Read : Trivikram : కోలీవుడ్ సూపర్ స్టార్ తో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేసిన త్రివిక్రం..!