Rangasthalam : అనసూయ రంగమ్మత్త పాత్రకి రాశి నో చెప్పింది.. ఎందుకు?
అనసూయ(Anasuya) నటించిన 'రంగమ్మత్త'(Rangammatta) పాత్ర కూడా మంచి ఫేమ్ ని సంపాదించుకుంది.
- Author : News Desk
Date : 06-11-2023 - 9:29 IST
Published By : Hashtagu Telugu Desk
సుకుమార్(Sukumar) దర్శకుడిగా రామ్ చరణ్(Ram Charan) హీరోగా తెరకెక్కిన సినిమా ‘రంగస్థలం'(Rangasthalam). 2018లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలోని రామ్ చరణ్ పాత్ర మాత్రమే కాదు, ప్రతి ఒక్కరి పాత్ర అందరికి గుర్తుండి పోయాయి. అలాగే అనసూయ(Anasuya) నటించిన ‘రంగమ్మత్త'(Rangammatta) పాత్ర కూడా మంచి ఫేమ్ ని సంపాదించుకుంది. ఈ పాత్రతో అనసూయ కెరీర్ కూడా టర్నింగ్ తీసుకుంది.
అయితే ఈ పాత్రకి మొదటి ఛాయిస్ అనసూయ కాదట. ఈ సినిమాలో రంగమ్మత్తగా సీనియర్ హీరోయిన్ రాశి(Rashi) నటించాల్సి ఉందట. సుకుమార్ ఆమెను సంప్రదించి కథ కూడా చెప్పాడట. కానీ ఆమె ఒక కారణం వల్ల నో చెప్పారట. ఆ విషయాన్ని రీసెంట్ గా అనసూయ ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది.
రంగమ్మత్త పాత్ర మోకాళ్ళ వరకు చీర కట్టాల్సి ఉందని ఆమె నో చెప్పారట. సీనియారిటీ వయసులో మోకాళ్ళ వరకు చీర కట్టడం ఇష్టం లేకే రాశి నో చెప్పారని, ఈ విషయం కూడా అనసూయకి ఎవరో మాట్లాడుతుంటే తెలిసిందని చెప్పుకొంచింది. అయితే సినిమాలో రంగమ్మత్త పాత్ర మోకాళ్ళ వరకు చీర కట్టేది.. కేవలం ఒకటి రెండు షాట్స్ లో మాత్రమే.
డ్రెస్సింగ్ పరంగా రంగస్థలంలో తాను ఇబ్బంది పడిన సందర్భాలు ఏం లేవని, చాలా కంఫర్టుబుల్ గానే చేశానని అనసూయ చెప్పుకొచ్చింది. ఇక ఈ పాత్ర కోసం అనసూయని ఒప్పించడానికి సుకుమార్ చాలా కష్టపడ్డాడట. అత్త అనే పదం అనిపించుకోవడానికి మొదటిలో ఆలోచించిందట. కానీ పాత్ర బలం తెలుసుకొని చివరికి ఒకే చెప్పి నటించింది అనసూయ.
Also Read : MLC Kavitha : రష్మిక ఫేక్ వీడియోపై స్పందించిన ఎమ్మెల్సీ కవిత.. చర్యలు తీసుకోవాలంటూ..