Rana : జై హనుమాన్ లో రానా కూడానా.. ప్రశాంత్ వర్మ సూపర్ ప్లానింగ్..!
Rana ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ని భారీగానే ప్లాన్ చేసినట్టు అర్ధమవుతుంది. సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్టుగానే కాస్టింగ్ ఫిక్స్ చేసిన ప్రశాంత్ వర్మ సినిమాతో ఈసారి రికార్డులు
- By Ramesh Published Date - 09:32 PM, Mon - 4 November 24

ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కిన హనుమాన్ సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న జై హనుమాన్ (Jai Hanuman) పనులను మొదలు పెట్టారు. రీసెంట్ గా దీపావళి సందర్భంగా జై హనుమాన్ నుంచి రిషబ్ శెట్టి మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ప్రశాంత్ వర్మ (Prashanth Varma) ఈ సీక్వెల్ ని కూడా భారీ ప్లానింగ్ తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది.
కాంతారాతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ తెచ్చుకున్న రిషబ్ శెట్టి (Rishab Shetty) సూపర్ హిట్ హనుమాన్ సీక్వెల్ లో నటించడంతో ఆ ప్రాజెక్ట్ కి డబుల్ క్రేజ్ ఏర్పడింది.
జై హనుమాన్ భారీ ప్లాన్..
ఐతే ఈ సినిమాలో రానా కూడా ఉంటాడన్న టాక్ బలంగా వినిపిస్తుంది. దానికి కారణం ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టితో పాటు రానా (Rana Daggubati) కూడా వారితో కలిసి ఫోటో దిగాడు. ప్రశాంత్ వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ ఫోటో చూసి రానా కూడా జై హనుమాన్ లో ఉంటాడా అని చర్చిస్తున్నారు.
చూస్తుంటే ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ని భారీగానే ప్లాన్ చేసినట్టు అర్ధమవుతుంది. సినిమాపై ఉన్న అంచనాలకు తగినట్టుగానే కాస్టింగ్ ఫిక్స్ చేసిన ప్రశాంత్ వర్మ సినిమాతో ఈసారి రికార్డులు సృష్టించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.
రానా లాంటి పాన్ ఇండియా స్టార్ కూడా జై హనుమాన్ కి తోడైతే సినిమా రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. సో ప్రశాంత్ వర్మ జై హనుమాన్ ఈసారి ప్లానింగ్ నెక్స్ట్ లెవెల్ అనిపించేలా ఉంది.
Also Read : Nikhil Appudo Ippudo Eppudo Trailer Talk : నిఖిల్ అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ట్రైలర్ టాక్..!