Rana Daggubati : ఎన్నికల ముందు చంద్రబాబుని, గల్లా జయదేవ్‌ని పొగిడిన రానా..
తాజాగా రానా ఓ ఇంటర్వ్యూలో ఎన్నికల గురించి ప్రస్తావించకుండా వేరే సందర్భాలతో చంద్రబాబు, ఎంపీ గల్లా జయదేవ్ ని పొగిడారు.
- By News Desk Published Date - 06:29 PM, Wed - 8 May 24

Rana Daggubati : ఓ పక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హీట్ ఎక్కువైంది. మరో అయిదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సినీ పరిశ్రమ నుంచి కూడా పలు పార్టీలకు పలువురు ప్రముఖులు మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. కొంతమంది సోషల్ మీడియాలో పోస్టుకు చేస్తున్నారు. తాజాగా రానా ఓ ఇంటర్వ్యూలో ఎన్నికల గురించి ప్రస్తావించకుండా వేరే సందర్భాలతో చంద్రబాబు(Chandrababu Naidu), ఎంపీ గల్లా జయదేవ్(Galla Jayadev) ని పొగిడారు.
ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో చంద్రబాబు పాత్రని రానా పోషించిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర గురించి రానా స్పందిస్తూ.. అసలు నేను చంద్రబాబు పాత్ర ఏంటి అనుకున్నాను. ఆయనతో నాకు ఎక్కువ కనెక్షన్ లేదు. కానీ నాకు ఊహ వచ్చి ఎదుగుతున్న సమయంలో ఆయనే సీఎం. హైదరాబాద్ ని ఆయన డెవలప్ చేయడం చూసాను. మా తాత కూడా ఎంపీ కాబట్టి అలా అప్పుడప్పుడు కలిసేవాళ్ళం కానీ ఎక్కువ పరిచయం లేదు. కానీ ఈ పాత్ర ఓకే అయ్యాక చంద్రబాబు గారిని కలిసి మాట్లాడి, ఆయనతో కొన్ని రోజులు ట్రావెల్ చేశాను అని అన్నారు.
అలాగే ఇదే ఇంటర్వ్యూలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అడగ్గా.. గల్లా జయదేవ్ నాకు ఇన్స్పిరేషన్. నా కంటే పెద్ద అయినా మేమిద్దరం ఫ్రెండ్స్. చెన్నై నుంచి మేము హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటి దగ్గర్లోనే ఉండేవాళ్ళు. దీంతో రోజూ కలిసేవాళ్ళం. ఆయన లైఫ్ లో చాలా విషయాల్లో నాకు క్లారిటీ ఇచ్చాడు అని తెలిపారు. దీంతో రానా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక నిన్న సినీ పరిశ్రమ నుంచి చాలా మంది సెలబ్రిటీలు ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలిపిన సంగతి తెలిసిందే.
Also Read : Ranveer Singh : ఇన్‌స్టాగ్రామ్‌లో పెళ్లి ఫోటోలు తీసేసిన రణ్‌వీర్.. కారణం ఏంటి..?