ఫర్ఫెక్ట్ మ్యాచ్ : మిహీకాకు ముద్దు పెట్టిన రానా.. మ్యారేజ్ వీడియో వైరల్!
టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటి గతేడాది కరోనా మహమ్మారి సమయంలో మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మిహీకా మ్యారేజ్ మోమోరీస్ ను గుర్తుచేసుకుంటూ పెళ్లి వీడియోను షేర్ చేశారు.
- By Balu J Published Date - 09:02 PM, Mon - 22 November 21
టాలీవుడ్ హీరో రానా దగ్గుపాటి గతేడాది కరోనా మహమ్మారి సమయంలో మిహీకా బజాజ్‌ను వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే మిహీకా మ్యారేజ్ మోమోరీస్ ను గుర్తుచేసుకుంటూ పెళ్లి వీడియోను షేర్ చేశారు. “పర్ఫెక్ట్ మ్యాచ్.. అన్ని విషయాలు సరిగ్గా ఒకదానిలోకి మార్చాయి. ప్రేమ… కాంతి… జీవితం… @ranadaggubati #నా ప్రతిదీ.” అని ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది.
ఒకవైపు కరోనా, మరోవైపు లాక్ డౌన్ కారణంగా 30 మంది అతిథుల సమక్షంలోనే రానా పెళ్లి జరిగింది. మెహందీ వేడుక నుంచి పెళ్లి వేడుక వరకు ప్రతిదీ ఈ వీడియోలో ఉంటాయి. అగ్ని చుట్టూ ఇద్దరు నడుస్తూ, రానా ఆమె మెడలో తాళిబొట్టు కడుతూ, పెళ్లి సమయంలో మిహీక పెదాలపై ముద్దు పెట్టిన సీన్స్ ఈ వీడియోలో కళ్లకు కడుతాయి. మ్యారేజ్ వీడియోపై ఓ అభిమాని ఇలా స్పందించాడు. “చాలా అందంగా, సంతోషంగా ఉంది. ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. జీవితకాలానికి మరిచిపోలేని క్షణాలు ఇవి!” అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.
కరోనా సమయంలో, కఠిన నిబంధనల మధ్య ఆగస్ట్ 8న రానా మిహీకా పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ ఏర్పాట్లపై రానా సంతోషం వ్యక్తం చేశాడు. “పెళ్లి చేసుకోవడానికి ఇదే సరైన సమయం అని భావించాను. అయితే పెళ్లికి ఎక్కువమంది వ్యక్తులను ఆహ్వానించలేకపోయాను. కానీ వ్యక్తిగతంగా పెళ్లి వేడుకు బాగా నచ్చింది. నేను ఓ ఇంటివాడ్ని కావడం నా తల్లిదండ్రులకు అమితమైన ఆనందాన్నిచ్చింది’’ అన్నారు రానా.
Related News
Rana Daggubati : రంగంలోకి రానా ‘సౌత్‌బే’.. హైదరాబాద్‌లో బాక్సింగ్ ఈవెంట్స్
Rana Daggubati : మన దేశంలో ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఇండియన్ ప్రో బాక్సింగ్ లీగ్ (IPBL) , ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్ (IBC) కీలక నిర్ణయం తీసుకున్నాయి.