Ramya Krishna: మళ్లీ 23 ఏళ్ల తర్వాత.. రజనీతో రమ్యకృష్ణ!
టాలీవుడ్ లో ప్రత్యేక పాత్రలకు కేరాఫ్ అడ్రస్ రమ్యకృష్ణ. పాత్రల ఎంపికలో తగు జాగ్రత్తలు పాటిస్తూ సత్తా చాటుతోంది.
- Author : Balu J
Date : 27-04-2022 - 5:06 IST
Published By : Hashtagu Telugu Desk
టాలీవుడ్ లో ప్రత్యేక పాత్రలకు కేరాఫ్ అడ్రస్ రమ్యకృష్ణ. పాత్రల ఎంపికలో తగు జాగ్రత్తలు పాటిస్తూ సత్తా చాటుతోంది. రజనీకాంత్ నటించిన ‘పడయప్ప’ (తెలుగులో ‘నరసింహ’)లో ఆమె నటన నేటికీ ఎవర్ గ్రీన్ అని చెప్పక తప్పదు. ఈ సినిమాలో ఆమె నీలాంబరిగా కనిపించి, హీరో రజనీకాంత్ కు ధీటుగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బాహుబలిలోనూ శివగామిగా ప్రేక్షకులను అలరించింది. తాజా సమాచారం ఏంటంటే.. 23 ఏళ్ల తర్వాత రమ్యకృష్ణ మళ్లీ రజనీకాంత్ సినిమాలో నటించనున్నట్టు తెలుస్తోంది. నెగిటివ్ రోల్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. రజనీకాంత్ తదుపరి చిత్రం ‘మృగం’ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. నెగిటివ్ షేడ్స్ ఉన్న మహిళ పాత్ర కోసం రమ్యకృష్ణ పేరు పరిశీలనలో ఉన్నట్టు టాక్.