Double ismart : ఆగష్టులో వస్తానంటున్న ఇస్మార్ట్.. అంటే పుష్ప వాయిదానే..!
ఆగష్టులో వస్తానంటున్న ఇస్మార్ట్. రిలీజ్ డేట్ ని ప్రకటించిన హీరో రామ్. అయితే అల్లు అర్జున్ పుష్ప 2 వాయిదా కన్‌ఫార్మ్‌నా..?
- By News Desk Published Date - 04:00 PM, Sat - 15 June 24

Double ismart : ఉస్తాద్ స్టార్ రామ్ పోతినేని, మాస్ దర్శకుడు పూరీజగన్నాధ్ తో కలిసి చేస్తున్న సినిమా ‘డబల్ ఇస్మార్ట్’. 2019లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’కి ఇది సీక్వెల్ గా రూపొందుంటుంది. ఈ సినిమా ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఫైనాన్సియల్ ప్రాబ్లెమ్స్ వల్ల ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీకి అన్ని అడ్డంకులు తొలిగిపోయాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం.. టీజర్ ని కూడా ఇటీవలే ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు.
అయితే రిలీజ్ డేట్ ని మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు దాని పై కూడా క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయబోతున్నట్లు రామ్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. ఈ అనౌన్స్‌మెంట్ తో రామ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. కానీ అల్లు అర్జున్ అభిమానులు మాత్రం.. ఈ అనౌన్స్‌మెంట్ తో ఆందోళన చెందుతున్నారు. గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో పుష్ప 2 రిలీజ్ వాయిదా పడుతుందనే వార్త హల్ చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.
Maammmaaaaa! Date block kar!!
– Ustaad #Doubleismart Shankar pic.twitter.com/7LQEeu3dVK
— RAm POthineni (@ramsayz) June 15, 2024
ఈ సమయంలో డబుల్ ఇస్మార్ట్ ఆగష్టు 15న వస్తామంటూ ప్రకటించడంతో.. పుష్ప 2 వాయిదా ఆల్మోస్ట్ కన్‌ఫార్మ్ అయ్యినట్లు తెలుస్తుంది. ఎందుకంటే పుష్ప 2ని ఆగష్టు 15న రిలీజ్ చేయాలనే మేకర్స్ డేట్ ని ఫిక్స్ చేసారు. ఈ సినిమా పై పాన్ ఇండియా వైడ్ భారీ క్రేజ్ ఉండడంతో.. బాలీవుడ్ సినిమాలు కూడా పుష్ప 2కి పోటీగా రావడానికి ఆలోచిస్తున్నాయి. అలాంటింది ప్రస్తుతం ప్లాప్స్ లో ఉన్న రామ్, పూరి.. తన డబుల్ ఇస్మార్ట్ ని ఎందుకు పుష్పకి పోటీగా తీసుకు వస్తారు.
ఇస్మార్ట్ ప్రకటనతో పుష్ప వాయిదా కన్‌ఫార్మ్ అని తెలిసి పోయింది. అయితే దీని పై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటనే రావాల్సి ఉంది. మరి ఆగష్టు నుంచి ఈ మూవీని ఎప్పటికి వాయిదా వేస్తారో చూడాలి.