RGV: తన సినిమా ప్రమోషన్ కి ‘RRR’ ను వాడుకుంటున్న ‘వర్మ’..!
- By HashtagU Desk Published Date - 11:55 AM, Thu - 31 March 22
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా తెరకెక్కించిన చిత్రం ‘మా ఇష్టం (డేంజరస్)’. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. లెస్బియనిజం కథాంశంతో ఈ చిత్రాన్ని వర్మ రూపొందించారు. ఇందులో అప్సర రాణి, నైనా గంగూలీలు నటించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో వర్మ బిజీబిజీగా ఉన్నారు. అయితే తనకు మాత్రమే తెలిసిన ప్రమోషన్ స్ట్రాటజీని మరోసారి ప్రదర్శిస్తున్నారు వర్మ. తన మూవీ ప్రమోషన్ లో భాగంగా వర్మ ఏ అంశాన్నీ వదలడం లేదు. అన్ని అంశాలను తన సినిమా ప్రమోషన్ కు వాడేసుకుంటున్నారు.
‘RRR’ ఘన విజయంతో ఆ సినిమాని వాడేసుకుంటున్నారు ఆర్జీవీ. తాజాగా రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను కూడా వదలలేదు వర్మ. ‘వెల్ రాజమౌళి సార్. మీకు తారక్, రామ్ చరణ్ వంటి డేంజరస్ బాయ్స్ ఉంటే… నాకు నైనా గంగూలీ, అప్సర రాణి వంటి డేంజరస్ గర్ల్స్ ఉన్నారు’ అని సోషల్ మీడియా వేదిక అయిన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. అంతేకాదు చరణ్, రాజమౌళి, తారక్ కలిసి ఉన్న ఫొటోతో పాటు… అప్సర, నైనాలతో తాను కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఏది ఏమైనా కూడా రూపాయి ఖర్చు లేకుండా తన సినిమాలను ఎలా ప్రమోట్ చేసుకోవాలో రామ్ గోపాల్ వర్మకు బాగా తెలుసు.
Well sirrr @ssrajamouli sir, if u have ur DANGEROUS men like @AlwaysRamCharan and @tarak9999 ,I also have my DANGEROUS women like @NainaGtweets and @_apsara_rani pic.twitter.com/XWDkb9ufSH
— Ram Gopal Varma (@RGVzoomin) March 30, 2022
Related News
RRR Movie: ఆర్ఆర్ఆర్ కు రెండేళ్లు.. త్రిబుల్ ఆర్ గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించిన చిత్రం ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించింది. అంతే కాకుండా కలెక్షన్ ల మోత మోగించింది. దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో విడుదల అయ్యి కోట్లలో కలెక్షన్స్ ను సాధించింది. కాగ