HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Gopal Varma Satires On Bheemla Nayak

Ram Gopal Varma: భీమ్లా ట్రైల‌ర్ పై సెటైర్స్.. ప‌వ‌న్ గాలి తీసిన ఆర్జీవీ

  • Author : HashtagU Desk Date : 22-02-2022 - 4:37 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Target RGV
Rgv

టాలీవుడ్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అండ్ ఆయ‌న ఫ్యాన్స్‌ను మ‌రోసారి మిస్ట‌ర్ వివాదం రామ్ గోపాల్ వ‌ర్మ. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే భీమ్లా నాయ‌క్ మూవీ ఈనెల 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా సోమ‌వారం ట్రైల‌ర్‌ను రిలీజ్ చేశారు భీమ్లా నాయ‌క్ మేక‌ర్స్. ట్రైల‌ర్ పై మిక్స్‌డ్ రెస్పాన్స్ వ‌చ్చినా, పీకే ఫ్యాన్స్ కార‌ణంగా యూట్యూబ్‌లో మాత్రం లైక్స్, కామెంట్స్ అండ్ వ్యూస్‌తో ట్రెండింగ్‌లో నిలిచింది.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ పై వివాదాల రారాజు ఆర్జీవీ స్పందించాడు. మామూలుగానే మెగా ఫ్యామిలీని సోష‌ల్ మీడియాలో ఓ రేంజ్‌లో ఆడుకుంటాడు.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి అయితే ఏకంగా ఓ సినిమా తీసి మ‌రీ చుక్క‌లు చూపించాడు. ముఖ్యంగా ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని కెల‌కి మ‌రీ రెచ్చ‌గొట్టడం ఆర్జీవీకి ఓ స‌ర‌దా.. ప‌వ‌న్‌ను ఏమ‌న్నా ఆయ‌న ఫ్యాన్స్ ర‌చ్చ ర‌చ్చ చేస్తారు.. కానీ ఆర్జీవీ ముందు మాత్రం ప‌వ‌న్ ఫ్యాన్స్ ప‌ప్పులు ఉడ‌క‌లేద‌నే చెప్పాలి.

ఇక ఇటీవ‌ల సీయం జ‌గ‌న్ ముందు మెగా బెగ్గింగ్ న‌చ్చ‌లేద‌ని మ‌రోసారి మెగా ఫ్యామిలీ అండ్ మెగా ఫ్యాన్స్‌ను రెచ్చ‌గొట్టేలా కామెంట్ చేశాడు. అయితే ఇప్పుడు మ‌రోసారి ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై సెటైర్స్ వేశాడు ఆర్జీవీ. పీకే ఫ్యాన్ అంటూ భీమ్లా నాయ‌క్ ట్రైల‌ర్ పై స్పందిస్తూ.. భీమ్లా నాయక్ ట్రైలర్ చూసిన తర్వాత ప‌వ‌న్ ఫ్యాన్‌గా హ‌ర్ట్ అయ్యాయ‌ని ఆర్జీవీ అన్నాడు. ఈ సినిమాను భీమ్లా నాయక్ అని కాకుండా డానియల్ శేఖర్ అని పిలవాలనిపిస్తోందని రామ్‌జీ అభిప్రాయపడ్డాడు.

రానా దగ్గుపాటిని ప్రమోట్ చేసేందుకు మూవీ మేకర్స్ పవన్ కళ్యాణ్‌ను ఉపయోగించారన్నాడు. బాహుబ‌లి మూవీతో రానా హిందీలో బాగా పాపుల‌ర్ అయ్యాడ‌ని, దీంతో భీమ్లా నాయ‌క్ చిత్రంలో రానా హీరో, ప‌వ‌న్ విల‌న్ అని బాలీవుడ్ ప్రేక్ష‌కులు అర్ధం చేసుకుంటార‌ని వ‌ర్మ అన్నాడు. ఇక‌ ట్రైలర్‌లో పవన్ కళ్యాణ్ కంటే రానాకే హైప్ వచ్చిందని ఆర్జీవీ తెలిపాడు. దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానిగా తాను చాలా బాధ‌ప‌డ్డాన‌ని, ప‌వ‌న్‌కు అత్యంత స‌న్నిహితులైన మేక‌ర్స్ ఈ విష‌యంలో జాగ్ర‌త్త తీసుకోక‌పోవ‌డం త‌న‌ను షాక్‌కు గురి చేసింద‌ని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. దీంతో మ‌రోసారి మిస్ట‌ర్ వివాదం చేసిన ట్వీట్స్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

From watching #BheemlaNayakTrailer it looks like the makers for some reason have used and abused @PawanKalyan to promote @RanaDaggubati ..I am hurted as a fan of P K

— Ram Gopal Varma (@RGVzoomin) February 21, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bheemla Nayak
  • bheemla nayak trailer
  • Pawan Kalyan
  • Ram Gopal Verma

Related News

Ustad Bhagat Singh Ccensor

Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీంకు సెన్సార్ షాక్

సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా 'యూ/ఏ' (U/A) సర్టిఫికెట్‌ను జారీ చేసింది. సినిమా రన్ టైమ్‌ను 2 గంటల 34 నిమిషాలుగా ఖరారు చేశారు. అయితే, పవన్ కళ్యాణ్ సినిమా అంటే చిన్న

  • Megamument

    Allu Sirish Wedding : అటు చిరు..ఇటు చరణ్ మధ్యలో పవన్ ! వాటే మెగా మూమెంట్ !!

  • Chiru Anna

    Viral : అల్లు శిరీష్ పెళ్లి లో అరుదైన ఘటన..చిరంజీవి కామెడీ కి పడీపడీ నవ్విన పవన్ భార్య అన్నా లెజివోనా

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd