Ram Charan : పిఠాపురంకి రామ్‌చరణ్.. డ్రెస్ కలర్ గమనించారా.. ఇదెక్కడి మాస్ రా బాబాయ్..
పిఠాపురం బయలుదేరిన రామ్ చరణ్ డ్రెస్ కలర్ గమనించారా..? ఇదెక్కడి మాస్ రా బాబాయ్..
- By News Desk Published Date - 10:03 AM, Sat - 11 May 24

Ram Charan : ఈసారి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతూ మెగా ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు పాలిటిక్స్ కి దూరంగా ఉన్న చిరంజీవి సైతం.. జనసేన నాయకులను, కూటమి అభ్యర్థులను, పవన్ కళ్యాణ్ ని గెలిపించాలంటూ సోషల్ మీడియా కాంపెయిన్ చేసారు. ఇక మిగిలిన ఫ్యామిలీ మెంబెర్స్.. నాగబాబు దంపతులు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ ఫీల్డ్ లోకి దిగి పవన్ కోసం ప్రచారం చేసారు.
రామ్ చరణ్ అండ్ అల్లు అర్జున్ ట్వీట్స్ వేసి తమ మద్దతుని తెలియజేసారు. అయితే నేడు ఎన్నికల ప్రచారం చివరి రోజున రామ్ చరణ్.. పిఠాపురం పర్యటనకు సిద్దమవ్వడంతో పిఠాపురం రాజకీయం మరింత హీటెక్కింది. రామ్ చరణ్ తన తల్లి సురేఖ మరియు మావయ్య అల్లు అరవింద్ తో కలిసి పిఠాపురం కుక్కుటేశ్వర ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. ఇందుకోసం ఈరోజు ఉదయం హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో రాజమండ్రి విమానాశ్రయానికి చరణ్ బయలుదేరారు.
కాగా హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కి చేరుకున్న రామ్ చరణ్ విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఆ విజువల్స్ లో కనిపించిన రామ్ చరణ్ అవుట్ ఫిట్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. గతంలో పవన్ కళ్యాణ్ ప్రచారం రథం వారాహి కలర్ పై అభ్యంతరం తెలుపుతూ వైసీపీ నాయకులు గొడవ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ టాప్ టు బోటం సేమ్ కలర్ అవుట్ ఫిట్ ధరించి పిఠాపురం బయలుదేరారు.
షర్ట్, ప్యాంటు, ఆఖరికి కాళ్ళకి వేసుకున్న షూస్ కూడా అదే రంగువి వేయడం జనసైనికులను ఆకట్టుకుంటుంది. దీంతో గతంలో పవన్ షేర్ చేసిన ఒక షర్ట్ పోస్టుని, ఇప్పుడు చరణ్ ఫోటోలను కలిపి నెట్టింట వైరల్ చేస్తున్నారు.
దేవుడు 🥵🔥🙏#RamCharan#GlobalStarRamCharan#GameChangerpic.twitter.com/04CMsipSG5
— EshwaRC15 Raj(Dhfc)🔥🔥 (@EshwarDhfc) May 11, 2024
మీరు ఏ కలర్ అయితే వేయకూడదని objection పెట్టారో top to bottom అదే కలర్ వేసుకున్నాడు.🤣🤣🤣#RamCharan#YuvasenaniForJanasenani ❤️ @PawanKalyan @AlwaysRamCharan pic.twitter.com/F8japC0OwZ
— Ajay Koyalkar (@AlwaysAjayAjju7) May 11, 2024