Ram Charan : మరోసారి తండ్రి కాబోతున్న రామ్ చరణ్!
Ram Charan : మెగా ఫ్యామిలీలో మళ్లీ సంబరాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు
- Author : Sudheer
Date : 23-10-2025 - 2:15 IST
Published By : Hashtagu Telugu Desk
మెగా ఫ్యామిలీలో మళ్లీ సంబరాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ శుభవార్తతో మెగా అభిమానులు, సినీ వర్గాలు ఉత్సాహంగా ఉన్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు ఘనంగా జరగగా, అదే సమయంలో ఉపాసన సీమంతం (బేబీ షవర్) కార్యక్రమాన్ని కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో నిర్వహించారు. దీపావళి, సీమంతం రెండూ ఒకేసారి జరపడంతో ఉపాసన సోషల్ మీడియాలో “డబుల్ సెలబ్రేషన్స్” అంటూ ఫోటోలు, వీడియోలను షేర్ చేశారు. ఆ వీడియోలో చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసనతో పాటు కుటుంబ సభ్యుల ఆనందం ప్రతిబింబించింది.
Gold : RBI వద్ద ఎంత బంగారం ఉందో తెలుసా?
రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇప్పటికే 2023 జూన్‌లో తమ మొదటి సంతానంగా క్లీంకారను ఆహ్వానించారు. కూతురు జననం తర్వాత ఉపాసన తల్లితనాన్ని ఆస్వాదిస్తూ, రామ్ చరణ్ కూడా తండ్రితనాన్ని గర్వంగా అనుభవిస్తున్నట్లు ఎన్నో సార్లు వెల్లడించారు. ఇప్పుడు రెండో సంతాన వార్తతో ఈ జంట మరోసారి వార్తల్లో నిలిచారు. మెగా అభిమానులు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వర్షం కురిపిస్తున్నారు. “సింబా వస్తున్నాడు!” అంటూ నెట్‌లో మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. చరణ్-ఉపాసన జంటపై దేశవ్యాప్తంగా ఉన్న అభిమానుల ప్రేమ మరింత పెరుగుతోంది.
ఈ వేడుక ద్వారా మెగా కుటుంబంలో సంతోష వాతావరణం నెలకొంది. చిరంజీవి కుటుంబం ఎప్పుడూ పెద్ద పండుగల సమయంలో కుటుంబ సమాగమాన్ని విశేషంగా జరుపుకుంటుంది. ఈసారి సీమంతం వేడుకతో ఆనందం రెట్టింపైంది. ఉపాసన పితామహుడు అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ప్రథాప్ రెడ్డి కుటుంబం, చిరంజీవి కుటుంబ సభ్యులు కలిసి ఈ వేడుకలో పాల్గొనడం విశేషం. ప్రస్తుతం రామ్ చరణ్ తన కొత్త సినిమా షూటింగ్ నుంచి స్వల్ప విరామం తీసుకుని కుటుంబంతో సమయం గడుపుతున్నాడు. మెగా ఫ్యామిలీ నుండి వచ్చే ఈ శుభవార్తతో అభిమానుల్లో పండుగ వాతావరణం నెలకొంది.
This Diwali was all about double the celebration, double the love & double the blessings.
🙏🙏 pic.twitter.com/YuSYmL82dd— Upasana Konidela (@upasanakonidela) October 23, 2025