HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Ram Charan Praises Sharwanands Biker Calls It A Unique Attempt

శ‌ర్వానంద్ బైక‌ర్ మూవీపై స్పందించిన రామ్ చ‌ర‌ణ్‌!

'బైకర్' సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న శర్వానంద్ ఇటీవల హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌ను సందర్శించి అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు.

  • Author : Gopi Date : 05-04-2026 - 4:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Biker
Biker

Ram Charan Praises Sharwanand: శర్వానంద్ నటించిన తాజా చిత్రం ‘బైకర్’ (Biker)పై హీరో రామ్ చరణ్ సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపించారు. తన స్నేహితుడు శర్వానంద్ సినిమాకు చరణ్ మద్దతు తెలపడం ఈ స్పోర్ట్స్ డ్రామాకు పెద్ద ప్లస్ అయ్యింది. తన X (ట్విట్టర్) ఖాతాలో స్పందిస్తూ.. ‘బైకర్’ సినిమా గురించి చాలా అద్భుతమైన విషయాలు వింటున్నానని, సినిమా మంచి విజయం సాధించడం పట్ల సంతోషంగా ఉందని రామ్ చరణ్ పేర్కొన్నారు. ఒక విభిన్నమైన కథాంశాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మించినందుకు యూవీ క్రియేషన్స్ (UV Creations)ను ఆయన అభినందించారు. వారి ప్రయత్నం నిజంగా ప్రశంసనీయమని కొనియాడారు.

తన ప్రియ మిత్రుడు శర్వానంద్‌కు అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని చరణ్ అన్నారు. అలాగే ఈ సినిమాలో రాజశేఖర్ పాత్రకు వస్తున్న సానుకూల స్పందనను కూడా ఆయన ప్రస్తావించారు.

Also Read: పచ్చి ఉల్లిపాయను ఎవరు తినకూడదు?

Hearing wonderful things about #Biker and so happy to see it doing so well ❤️

Hats off to @UV_Creations for backing a unique concept with such conviction and mounting it on a grand scale without compromise. Truly commendable.

Glad to see my dearest friend @ImSharwanand…

— Ram Charan (@AlwaysRamCharan) April 5, 2026

దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర గురించి చెబుతూ.. ఈ చిత్రాన్ని ఒక విభిన్నమైన ప్రయత్నంగా చ‌ర‌ణ్ పేర్కొన్నారు. నిర్మాతలకు (వంశీ, ప్రమోద్, విక్రమ్), చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. తాను కూడా త్వరలోనే ఈ సినిమాను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. చరణ్ చేసిన ఈ పోస్ట్ సినిమా స్థాయిని మరింత పెంచుతుందని, ఆయన రివ్యూ చిత్రానికి మరింత ఊపునిస్తుందని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక నాయర్, అతుల్ కుల్కర్ణి, బ్రహ్మాజీ, శశాంక్ కీలక పాత్రలు పోషించగా, జిబ్రాన్ సంగీతం అందించారు.

Thank you so much Ram Charan garu 😊 https://t.co/gS7tS0NpvY

— Dr.Rajasekhar (@ActorRajasekhar) April 5, 2026

SHARWA ga Matladuthunna

Either you like it or don't like it, I left it to audience, They are the gods My gods 💥

Confident speech by @ImSharwanand 👌 #Biker pic.twitter.com/WFuELNSQja

— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) April 5, 2026

శర్వానంద్ భావోద్వేగం

‘బైకర్’ సినిమా విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న శర్వానంద్ ఇటీవల హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌ను సందర్శించి అభిమానులతో కలిసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన ఒక సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా అక్కడి వారందరినీ భావోద్వేగానికి గురిచేసింది.

సినిమా థియేటర్ లోపల పెద్ద స్క్రీన్‌కు గౌరవ సూచికంగా శర్వానంద్ మోకాళ్లపై వంగి, నేలపై సాష్టాంగ నమస్కారం చేశాడు. శ‌ర్వా చేసిన ఈ అరుదైన చర్య అభిమానులను ఆశ్చర్యపరిచింది. వరుస పరాజయాలతో కొంత కాలం ఇబ్బంది పడిన శర్వానంద్.. ఇప్పుడు ‘నారి నారి నడుమ మురారి’, ‘బైకర్’ వంటి ప్రామిసింగ్ సినిమాలతో తిరిగి ఫామ్‌లోకి వచ్చారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Biker Movie
  • jeevitha rajasekhar
  • Rajasekhar
  • Ram Charan Praises Sharwanand
  • Unique Attempt

Related News

    Latest News

    • Tollywood : డైరెక్టర్ మెహర్ ఇంట పెళ్లి సందడి..చిరు , కేటీఆర్ హాజరు !!

    • Free Bus : బస్సు ఆపలేదని ఏకంగా డ్రైవర్‌పై దాడి

    • NEET : రేపే NEET అడ్మిట్ కార్డులు విడుదల

    • YCP : సజ్జలకు వైసీపీ బాధ్యతలు?

    • IPL: ధోనీ రికార్డ్ బద్దలుకొట్టిన సంజూ

    Trending News

      • ముంబై ఇండియన్స్‌కు కొత్త కెప్టెన్‌?

      • అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం.. యుద్ధం త‌ప్ప‌దా?

      • కొత్త సిలిండర్ బుకింగ్ రూల్స్.. మే 1 నుండి మారనున్న నిబంధనలు?

      • వైభవ్‌ సూర్యవంశీ ఖాతాలో రికార్డులే రికార్డులు!

      • ఐపీఎల్ 2026.. ఒకే రోజు 986 ప‌రుగులు!!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd