Acharya’s Neelambari: పూజా, చెర్రీ కెమిస్ట్రీ అదుర్స్.. ఈ సాంగ్ ఆచార్యకే హైలైట్!
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ఆచార్య. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్ నిర్మిస్తోంది.
- By Balu J Published Date - 01:06 PM, Fri - 5 November 21

కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ఆచార్య. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ఈ మూవీలో రామ్ చరణ్, పూజా హెగ్డే సైతం నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీకు సంబధించిన నీలాంబరి పాటకు మంచి రెస్సాన్స్ వస్తోంది. మెలోడీ బీట్స్ తో సాగే నీలాంబరి..నీలాంబరి’ పాట మెగాభిమానులకు మంచి కిక్ ఇస్తోంది. ముఖ్యంగా ఈ పాటలో చరణ్, పూజా హెగ్డే కెమిస్ట్రీ మధ్య బాగా కుదిరింది. నీలాంబరి అని వర్ణిస్తూ చెర్రీ వేసిన స్టప్పులు వీపరితంగా ఆకట్టుకున్నాయి. ఈ పాట ఆచార్యకే హైలైట్ నిలుస్తుందని చెప్పక తప్పదు.
ఈ పాటను అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాడారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించారు. మణిశర్మ మ్యూజిక్ అందించారు. మెగాస్టార్ చిరు నటించిన ఈ మూవీ 4 ఫిబ్రవరి 2022న థియేటర్‌లలో విడుదల కానుంది. ఆచార్యతో పాటు, రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్‌తో కలిసి నటించిన SS రాజమౌళి యొక్క RRR గ్రాండ్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న RC15 మొదటి షెడ్యూల్‌ని కూడా పూర్తి చేశాడు. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. ఇంతలో, పూజా హెగ్డేకి ప్రభాస్‌తో పాన్-ఇండియా చిత్రం రాధే శ్యామ్, రణవీర్ సింగ్‌తో బాలీవుడ్ చిత్రం సర్కస్, సల్మాన్ ఖాన్‌తో భాయిజాన్ వంటి చిత్రాల్లో కూడా నటించనుంది. ప్రస్తుతం ఆమె దళపతి విజయ్ నటిస్తున్న బీస్ట్ షూటింగ్‌లో ఉంది.
Related News

Pooja Hegde : సమంత ప్లేస్ లో పూజా హెగ్డే..!
Pooja Hegde స్టార్ హీరోయిన్ సమంత తనకు వచ్చిన మయోసైటిస్ మధ్యలో తగ్గిందని అనిపించినా అది పూర్తిగా నయం కాలేదని మళ్లీ సినిమాలకు