Madame Tussauds : మెగా ఫ్యామిలీ ని సంబరాల్లో నింపుతున్న వరుస తీపి కబుర్లు..
Madame Tussauds : రామ్ చరణ్ ప్రాణంగా పెంచుకుంటున్న అతడి పెంపుడు శునకం రైమీ మైనపు విగ్రహాన్ని సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు
- By Sudheer Published Date - 06:36 PM, Sun - 29 September 24

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంట్లో క్లీంకర (Klin Kaara) అడుగుపెట్టిన క్షణం నుండి మెగా ఫ్యామిలీకి అన్ని కలిసొస్తున్నాయి. వరుస తీపి కబుర్లు మెగా ఫ్యామిలీ లో సంబరాలు నింపుతున్నాయి. పవన్ కళ్యాణ్ పదేళ్లుగా ఎదురుచూస్తున్న భారీ విజయం అందడం..చిరంజీవి వరుస అవార్డ్స్ వస్తుండడం..ఇలా ఎన్నో జరుగుతూ వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు రామ్ చరణ్ (Ram CHaran) కు అరుదైన గౌరవం దక్కింది.
సింగపూర్ లోని టుస్సాడ్స్ (Madame Tussauds) మ్యూజియంలో ప్రముఖుల మైనపు విగ్రహాలను ఉంచడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ , అల్లు అర్జున్ వంటి వారి విగ్రహాలు రేపాటు చేయగా.. ఈసారి ప్రముఖుల మైనపు విగ్రహాలతో పాటు.. వారి పెంపుడు శునకంకు సైతం చోటు దక్కడం విశేషం. మెగా పవర్ స్టార్, గ్లోబల్ స్టార్ గా టాలీవుడ్ లో హిట్ హీరోగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ మైనపు విగ్రహాన్ని (Ram Charan Statue ) త్వరలోనే మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. అంతేకాదు రామ్ చరణ్ ప్రాణంగా పెంచుకుంటున్న అతడి పెంపుడు శునకం రైమీ (Charan Pet Dog, Rhyme) మైనపు విగ్రహాన్ని సైతం ఇక్కడ ఏర్పాటు చేయడం గొప్ప విశేషంగా చెప్పుకోవచ్చు.
ఇప్పటికే మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కావలసిన ఫోటోషూట్ లో రామ్ చరణ్ తో పాటు, రైమీ సైతం పాల్గొంది. త్వరలోనే వీరి మైనపు విగ్రహాన్ని మ్యూజియంలో ఏర్పాటు చేయనుండగా.. తనకు దక్కిన ప్రత్యేక గుర్తింపుపై రామ్ చరణ్ స్పందించారు. మేడమ్ టుస్సాడ్స్ ఫ్యామిలీలో తాను కూడా ఒక భాగం కావడం తనకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంపై మెగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా.. చరణ్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇటు మెగాస్టార్ చిరంజీవి కి తాజాగా గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన విషయం అందరికీ తెలిసిందే. తన తండ్రి మెగాస్టార్ గిన్నిస్ బుక్ రికార్డు సాధించిన ఆనందంలో ఉన్న రాంచరణ్ కు.. ఈ మ్యూజియంలో చోటు దక్కడంతో మెగా ఇంట సంబరాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ తో డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రేపు ఈ మూవీ లోని రా..రా మచ్చ సాంగ్ విడుదల కాబోతుంది. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఫై మెగా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Read Also : Jr NTR Politics : రాజకీయాలు కాదు నటనే నాకు ముఖ్యం – ఎన్టీఆర్