RRR Glimpse : ఆర్ఆర్ఆర్ గ్లింప్స్.. అదిరిపోయింది బాసూ!
దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్‘ మూవీలో రామ్ చరణ్, Jr ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం అందరికీ తెలిసిందే.
- By Balu J Published Date - 12:37 PM, Mon - 1 November 21
దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్‘ మూవీలో రామ్ చరణ్, Jr ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులే లేకుండా.. ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అనే ఆసక్తి ఎదురుచూస్తున్నారు. అయితే దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ కోసం చిత్ర నిర్మాతలు ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఇప్పటికే ప్రమోషన్ పనుల్లో రాజమౌళితోపాటు ఆర్ఆర్ఆర్ టీం కూడా బిజీబిజీగా ఉన్నారట. తాజాగా ఆర్ఆర్ఆర్ నిర్మాతలు 40 సెకన్ల నిడివి గల ఫస్ట్ గ్లింపస్ ను విడుదల చేశారు. టైటిట్ కు తగ్గట్టుగానే చాలా ఆసక్తికరంగా ఉంది. వీడియోలో అలియా భట్ అజయ్ దేవగన్ తమ ఇంటెన్స్ రోల్ తో క్యూరియాసిటీని పెంచారు.
What’s up boys!!! 😉
The RRR Era Begins!! 💥🔥🌊https://t.co/khszq8EcOg #RRRGimpse #RRRMovie
— RRR Movie (@RRRMovie) November 1, 2021
40 సెకన్ల వీడియో యాక్షన్తో నిండి ఉంది. ఉత్కంఠభరితమైన విజువల్స్ కళ్లార్పకుండా చేస్తాయి. స్వాతంత్ర్యానికి పూర్వం భారతదేశం నేపథ్యంలో కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల కల్పిత పాత్రలతో ఈ సినిమా తెరకెక్కింది. బాహుబలి సిరీస్లో రికార్డుల మోత మోగించడంలో కీలకంగా వ్యవహరించి ఎస్ఎస్ రాజమౌళి ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహిస్తుండటం మరింత అంచనాలు పెంచేసింది. RRRలో ఒలివియా మోరిస్, రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ వంటి అంతర్జాతీయ నటులు కూడా నటిస్తుండటంతో ఈ మూవీపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి. RRR మొత్తం 5 భాషల్లో విడుదల కానుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పై D. V. V. దానయ్య నిర్మించారు. 2022 జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Related News
Game Changer : బాలీవుడ్లో రికార్డు సృష్టించిన స్టాండ్ ఎలోన్ సినిమాలు ఇవే.. RRR తరువాత గేమ్ ఛేంజర్..
బాలీవుడ్లో థియేట్రికల్ రైట్స్ బిజినెస్ తో రికార్డు సృష్టించిన స్టాండ్ ఎలోన్ సినిమాలు ఇవే. RRR తరువాత గేమ్ ఛేంజర్..