Game Changer Song : గేమ్ ఛేంజర్ రెండో సాంగ్ వచ్చేసింది.. రా మచ్చా అంటూ అదరగొట్టిన చరణ్..
ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవ్వగా తాజాగా రెండో పాటని విడుదల చేసారు.
- Author : News Desk
Date : 30-09-2024 - 4:08 IST
Published By : Hashtagu Telugu Desk
Game Changer Song : మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇన్నాళ్లు ఆ సినిమా అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూసారు ఫ్యాన్స్. గత కొన్ని రోజులుగా రెగ్యులర్ గా గేమ్ ఛేంజర్ మూవీ యూనిట్ యాక్టివ్ గా ఉంటూ అప్డేట్స్ ఇస్తూ ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తుంది. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి ఒక సాంగ్ రిలీజ్ అవ్వగా తాజాగా రెండో పాటని విడుదల చేసారు.
గేమ్ ఛేంజర్ లోని ఈ రెండో పాటను అనంత శ్రీరామ్ రాయగా తమన్ సంగీత దర్శకత్వంలో నకాష్ అజీజ్ పాడారు. లిరికల్ విడియోలోనే చరణ్ వి కొన్ని స్టెప్స్ చూపించారు. దీంతో సినిమాలోని సాంగ్స్ లో చరణ్ ఇంకే రేంజ్ లో డ్యాన్స్ అదరగొట్టాడో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మీరు కూడా ఈ సెకండ్ సాంగ్ ని వినేయండి..
ఇక ఈ సాంగ్ కోసం ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందిన ఆల్మోస్ట్ 1000కి పైగా జానపద కళాకారులతో కలిసి రామ్ చరణ్‌తో డాన్స్ చేసాడు. ఈ పాటని వైజాగ్, అమృత్ సర్ లో షూటింగ్ చేసారు. దసరాకు గేమ్ ఛేంజర్ టీజర్, అక్టోబర్ చివరి వారంలో మూడో పాట రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. సినిమా మాత్రం క్రిస్మస్ కు రిలీజ్ కానుంది.
Also Read : Jani Master Bail : జానీ మాస్టర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా