Game Changer Song : రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ నెక్స్ట్ సాంగ్ వచ్చేసింది..
చరణ్, కియారా స్టైలిష్ సాంగ్ మీరు కూడా చూసేయండి..
- By News Desk Published Date - 10:01 AM, Sun - 22 December 24

Game Changer Song : రామ్ చరణ్ హీరోగా రాబోతున్న సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు నిర్మాణంలో శంకర్ దర్శకత్వంలో భారీగా తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 10న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. కియారా అద్వానీ, అంజలి, SJ సూర్య, శ్రీకాంత్, సునీల్.. ఇలా చాలా మంది స్టార్స్ ఈ సినిమాలో నటించారు.
తాజాగా నేడు అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు, టీజర్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా తాజాగా గేమ్ ఛేంజర్ సినిమా నుంచి నెక్స్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ‘దోప్..’ అంటూ స్టైలిష్ గా సాగింది ఈ పాట. రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాయగా థమన్ మ్యూజిక్ దర్శకత్వంలో తమన్, రోషిని, పృద్వి, శృతి రంజని పాడారు.
ఈ లిరికల్ సాంగ్ చూస్తుంటేనే శంకర్ మార్క్ విజువల్స్ తో పాట అదిరిపోతుంది తెలుస్తుంది. చరణ్, కియారా స్టైలిష్ సాంగ్ మీరు కూడా చూసేయండి..