Game Changer : శంకర్, దిల్ రాజు పై చరణ్ అభిమానుల ఆగ్రహం.. నెట్టింట నెగటివ్ ట్రెండ్..
శంకర్, దిల్ రాజు పై చరణ్ అభిమానుల ఆగ్రహం. గేమ్ ఛేంజర్ అప్డేట్ కోసం నెట్టింట నెగటివ్ ట్రెండ్.
- By News Desk Published Date - 08:17 PM, Thu - 5 September 24
Game Changer : ఆర్ఆర్ఆర్ తరువాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ మూవీ స్టార్ట్ చేసి మూడేళ్లు పూర్తీ అయ్యిపోయింది. కానీ ఇంకా సెట్స్ పైనే ఉంది. ఇండియన్ 2 షూటింగ్ వల్ల ఈ మూవీ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇండియన్ 2 కూడా పూర్తీ అయ్యింది. గేమ్ ఛేంజర్ ని ఈ ఏడాది డిసెంబర్ లో రిలీజ్ చేస్తామంటూ.. నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్స్ ని స్టార్ట్ చేయలేదు. ఈ మూవీ నుంచి ఇప్పటివరకు ఒక సాంగ్ మాత్రమే రిలీజ్ అయ్యింది.
సెప్టెంబర్ నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ వరసగా ఉంటాయని గతంలో దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఇప్పుడు సెప్టెంబర్ వచ్చేసింది, వినాయక చవితి ఫెస్టివల్ కూడా దగ్గరపడింది. కానీ మూవీ టీం నుంచి ఎటువంటి యాక్టివిటీ లేదు. రామ్ చరణ్ తో పాటు ఆర్ఆర్ఆర్ లో నటించిన ఎన్టీఆర్.. దేవర సినిమాతో ఈ నెలలో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ గేమ్ ఛేంజర్ కంటే ఆలస్యంగానే మొదలయ్యింది. కానీ గేమ్ ఛేంజర్ కంటే ముందే ఆడియన్స్ ముందుకు వచ్చేస్తుంది. ఈ విషయం కూడా చరణ్ అభిమానులకు కోపం తెప్పిస్తుంది.
ఇక మూవీ టీం చేసే ఆలస్యంతో విసిగెత్తి పోయిన చరణ్ అభిమానులు.. దిల్ రాజు మరియు శంకర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ హీరో ప్రైమ్ టైంని దర్శకనిర్మాతలు వృధా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో శంకర్ అండ్ దిల్ రాజు పై నెగటివ్ ట్రెండ్ చేస్తూ తమ కోపాన్ని తెలియజేస్తున్నారు. దీంతో ప్రస్తుతం నెట్టింట గేమ్ ఛేంజర్ ట్రెండ్ అవుతుంది. మరి మూవీ టీం ఇప్పటికైనా అప్డేట్ ని ఇస్తారా లేదా చూడాలి.
Tags
Related News
Game Changer : వినాయక చవితి స్పెషల్ గేమ్ ఛేంజర్ అప్డేట్.. కొత్త పోస్టర్ అదిరింది..
గేమ్ ఛేంజర్ సినిమా నుంచి రామ్ చరణ్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది.