Jani Master : జానీ మాస్టర్ కి ఆఫర్ ఇచ్చిన రామ్ చరణ్.. చరణ్ జానీ మాస్టర్ కి ఏం చెప్పాడంటే..
జానీ మాస్టర్ జైలు నుంచి బయటకు వచ్చాక ఎవరూ పట్టించుకోవట్లేదు అని వార్తలు వచ్చాయి.
- By News Desk Published Date - 10:26 AM, Tue - 24 December 24

Jani Master : ఇటీవల జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో అరెస్ట్ అయి బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకువచ్చాక కొన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నా ఇప్పుడిప్పుడే బయట ఈవెంట్స్ కి, డ్యాన్స్ ప్రాక్టీస్ కి వస్తున్నాడు. ఇటీవలే జానీ మాస్టర్ కంపోజ్ చేసిన గేమ్ చెంజర్ సినిమా సాంగ్ కూడా రిలీజయింది.
ఈ సందర్భంగా తాజాగా జానీ మాస్టర్ ఓ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా రామ్ చరణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read : Film Industry : ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్ నుంచి ఏపీకి వెళ్లిపోతుందా ? ఏం జరగబోతోంది ?
జానీ మాస్టర్ మాట్లాడుతూ.. నేను జైలు నుంచి బయటకు వచ్చాక రామ్ చరణ్ కాల్ చేసారు. ఎక్కువ ఆలోచించకు, హెల్త్ మీద ఫోకస్ పెట్టు, మళ్ళీ ప్రాక్టీస్ మొదలుపెట్టు, సాంగ్స్ విషయంలో ఎప్పటిలాగే ఫ్యాషనేట్ గా ఉండు అని చెప్పారు. అలాగే బుచ్చిబాబు సినిమా చేస్తున్నాను, ఆ సినిమాలో సాంగ్స్ చేద్దువు అని చెప్పారు. దాంతో చరణ్ గారు నాకు ఆఫర్ ఇవ్వడంతో చాలా హ్యాపీగా అనిపించింది అని తెలిపారు.
జానీ మాస్టర్ జైలు నుంచి బయటకు వచ్చాక ఎవరూ పట్టించుకోవట్లేదు అని వార్తలు వచ్చాయి. ఆఫర్స్ కూడా ఎవరూ ఇవ్వట్లేదు అని, జానీ మాస్టర్ ఈ విషయంలో బాధపడ్డాడు అని వినిపించింది. జానీ మాస్టర్ ముందు నుంచి మెగా కుటుంబానికి వీర విధేయుడు. ఇప్పుడు రామ్ చరణ్ కాల్ చేసి మరీ ఛాన్స్ ఇవ్వడంతో జానీ మాస్టర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడైనా వేరే హీరోలు జానీ మాస్టర్ కి ఆఫర్స్ ఇస్తారేమో చూడాలి.