Ram Charan – Upasana : ఉపాసన కాళ్లు నొక్కిన రామ్ చరణ్..ప్రేమంటే ఇంతే మరి..!!
- Author : Sudheer
Date : 02-03-2024 - 1:11 IST
Published By : Hashtagu Telugu Desk
బయటకు ప్రతి మగడు పులిలా ఉన్న..భార్య దగ్గర మాత్రం పిల్లే అని అంత అంటారు..ఇది కేవలం సామాన్య ప్రజలే కాదు సినీ స్టార్స్ కూడా అంతే..తెరపై ఎంత పెద్ద హీరోయినా..కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సరే..భార్య ను ఫాలో కావాల్సిందే. ఇంటి పనులు చేయడం దగ్గర నుంచి, షాపింగ్ వెళ్తే బ్యాగులు మొయ్యడం వరకూ.. ప్రతి దాంట్లో భార్య కు సహాయం చేయాల్సిందే. అవసరమైతే అప్పుడప్పుడు కాళ్ళు కూడా నొక్కాల్సి వస్తుంది. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా అలాగే చేస్తూ వైరల్ గా మారాడు. టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ లలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసనల జంట ఒకటి. 2012 జూన్ 14న ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట.. ఎంతో అన్యోన్యమైన జీవితాన్ని గడుపుతూ, ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
తాజాగా ఈ జంట అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలో పాల్గొనేందుకు హైదరాబాద్ నుంచి జామ్ నగర్ వెళ్లిన విషయం తెలిసిందే. స్పెషల్ ఫ్లైట్‌లో ఈ జంట వెళుతుండగా.. రామ్ చరణ్ ఉపాసన కాళ్ళు నొక్కుతూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది రామ్ చరణ్ టీమ్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఎంత పెద్ద స్టార్ హీరో అయిన పెళ్లి అయ్యిన తర్వాత భార్య సేవకుడే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక అంబానీ ఇంట సంబరాలు అంబురాన్ని తాకుతున్నాయి. ఇండియాలో ఏ పారిశ్రామిక వేత్తకు సాధ్యం కాని రేంజ్ లో వేడుకలు అంబానీ ఇంట జరుగుతున్నాయి. గుజరాత్ (Gujarat) రాష్ట్రంలోని జామ్‌నగర్ (Jamnagar)లో లో అనంత్ అంబానీ (Anant Ambani ) – రాధిక మర్చంట్ (Radhika Merchant)ల ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్ నగర్‌లో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకకు పెద్ద ఎత్తున సినీ , రాజకీయ , క్రీడా ప్రముఖులు హాజరయ్యారు. అలాగే రామ్ చరణ్ తన భార్య ఉపాసనతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యారు. ఈవెంట్ వేదిక లోపలికి వెళ్లేముందు మీడియాకు చరణ్ – ఉపాసన పోజులు ఇస్తుండగా అక్కడ మీడియా, అభిమానులు చరణ్ ని చూసిన ఆనందంతో జై శ్రీరామ్ అని నినాదాలు చేశారు. RRR సినిమాలో క్లైమాక్స్ లో రామ్ చరణ్ శ్రీ రాముడి లుక్ లో కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో నార్త్ లో ఆ లుక్ బాగా వైరల్ అవ్వడం, చరణ్ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటం తెలిసిందే.
— TeamUpasana (@TeamUpasana) March 1, 2024
Read Also : Sania Mirza: మహిళల విజయానికి ఎలా విలువ కడుతున్నాం?.. సానియా మీర్జా వీడియో ట్వీట్