Rakul Preet Singh: ఫెస్టివల్ మూడ్ లో రకుల్.. ఎల్లో సారీలో అదుర్స్!
ఆనందాలను నింపే దీపావళి రానే వచ్చేస్తోంది. టాపాసులు కాలుస్తూ కుటుంబమంతా జరుపుకునే దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి
- Author : Balu J
Date : 20-10-2022 - 4:39 IST
Published By : Hashtagu Telugu Desk
ఆనందాలను నింపే దీపావళి రానే వచ్చేస్తోంది. టాపాసులు కాలుస్తూ కుటుంబమంతా జరుపుకునే దీపావళి పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రతిఒక్కరూ ఇష్టం చూపుతారు. దీపావళి ఫెస్టివల్స్ స్టార్స్ కూడా ప్రత్యేకమే. అందుకే వారంరోజుల ముందుగానే పండుగ జోష్ లో కనిపిస్తారు. టాలీవుడ్ బ్యూటీ రకుల్ దీపావళిని పురస్కరించుకొని అందంగా ముస్తాబైంది. పసుపు రంగు చీర కట్టుకొని, బిగుతైన జాకెట్ ధరించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. ‘చిరునవ్వులతో కిక్‌స్టార్టింగ్ దీపావళి’ అంటూ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యింది. ఎల్లో సారీలో మెరుపులు మెరిపించిన రకుల్ అందానికి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ గా మారాయి.
Main hoon na feels 💕 pic.twitter.com/wiMmHMzqBv
— Rakul Singh (@Rakulpreet) October 20, 2022