777 Charlie : ఆరు పప్పీస్‌కి జన్మనిచ్చిన ‘చార్లీ’ కుక్క.. పప్పీస్‌తో రక్షిత్ శెట్టి వీడియో వైరల్..
ఆరు పప్పీస్‌కి జన్మనిచ్చిన 'చార్లీ' మూవీలోని కుక్క. ఆ పప్పీస్‌ని కలుసుకున్న రక్షిత్ శెట్టి..
- By News Desk Published Date - 11:51 AM, Sat - 18 May 24

777 Charlie : యానిమల్ నేపథ్యంతో వచ్చిన సినిమాలు ఆడియన్స్ ని ఎప్పుడు ఆకట్టుకుంటాయి. అలా 2022లో ఆడియన్స్ ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న కన్నడ సినిమా ‘777 చార్లీ’. రక్షిత్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమా కథ.. ఒక కుక్క చుట్టూ తిరుగుతుంది. మంచు ప్రదేశాలు అంటే ఇష్టపడే చార్లీ అనే కుక్క.. చనిపోయే స్టేజికి వస్తుంది. దీంతో దాని చివరి కోరిక తీర్చడం కోసం హీరో.. చార్లీని మంచు ప్రదేశాలకు తీసుకు వెళ్తాడు.
గుండె హత్తుకునేలా ఉన్న ఈ కథ ప్రేక్షకులను బాగా ఎమోషనల్ చేసి నేషనల్ అవార్డుని అందుకునేలా చేసింది. బెస్ట్ కన్నడ ఫీచర్ ఫిలిం క్యాటగిరిలో చార్లీ సినిమా నేషనల్ అవార్డుని అందుకుంది. అంతేకాదు, స్టేట్ అవార్డులతో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డులను కూడా అందుకుంది. ఈ సినిమాతోనే కన్నడ హీరో అయిన రక్షిత్ కి ఇతర పరిశ్రమల్లో కూడా మార్కెట్ క్రియేట్ అయ్యింది. అందుకే రక్షిత్ మనసులో ఈ సినిమాకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. అలాగే చార్లీ రోల్ చేసిన ఆ కుక్కని కూడా రక్షిత్ ఎంతో ప్రేమిస్తుంటారు.
తాజాగా ఆ కుక్క ఆరు పప్పీస్ కి జన్మనిచ్చింది. ఇక ఆ విషయం తెలుసుకున్న రక్షిత్.. మైసూర్ వెళ్లి ఆ పప్పీస్ ని కలుసుకున్నారు. తల్లి అయిన చార్లీతో పాటు ఆ ఆరు పప్పీస్ ని కూడా ముద్దాడుతూ రక్షిత్ కొంత సమయం గడిపారు. ఇక అందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆడియన్స్ కి తెలియజేసారు. “మా చార్లీ ఫ్యామిలీలోకి మరో ఆరో క్యూట్ పప్పీస్ వచ్చి చేరాయి. ఈ విషయం మీతో షేర్ చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది” అంటూ రక్షిత్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.