Jailer vs Bhola Shankar: బాక్సాఫీస్ వార్ లో బోల్తా కొట్టిన ‘భోళా శంకర్’, దూసుకుపోతున్న ‘జైలర్’
సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి.
- By Balu J Published Date - 04:02 PM, Fri - 11 August 23
సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమా జైలర్ ఆగస్ట్ 10న విడుదలైంది. అలాగే చిరంజీవి నటించిన భోళాశంకర్ సినిమా కూడా ఈరోజు (ఆగస్టు 11) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్న విడుదలైన జైలర్ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఎప్పటిలాగే రజనీకాంత్ సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ క్రేజ్ కారణంగానే ఈ సినిమా తొలిరోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉన్నాయి. సూపర్‌స్టార్ సినిమా ఫలితాల కలెక్షన్లు అదిరిపోయాయి. ఇప్పుడు జైలర్ హిట్ కావడంతో కలెక్షన్లు రెట్టింపు కావడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.
జైలర్ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. జైలర్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లు కలెక్ట్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఓవరాల్ గా జైలర్ సినిమా 72 కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. చాలా కాలం తర్వాత రజనీకాంత్ ఘన విజయం సాధించాడు. వాల్తేరు వీరయ్యతో చిరంజీవి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు భోళా శంకర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. భోళాశంకర్ సినిమా మొదటి రోజు భారీ వసూళ్లు సాధిస్తుందని చిత్రయూనిట్ నమ్మకంగా ఉంది. కానీ మొదటి షోకే భోళా శంకర్ బోరింగ్ శంకర్ అని తేల్చేశారు ప్రేక్షకులు. ఎప్పటిలాగే ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేశ్ తన ఫెయిల్యూర్ పరంపరను కొనసాగిస్తున్నాడని మెగా అభిమానులు మండిపడతున్నారు.
శక్తి, కంత్రీ, షాడో సినిమా మాదిరిగానే భోళా శంకర్ ఫెయిల్యూర్ గా మిగిలిపోతుందని సగటు ప్రేక్షకులు తీర్పునిచ్చారు. గొప్ప స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ డైరెక్టర్ మెహర్ రమేశ్ ఉపయోగించుకోలేకపోయాడని, అతనికి ఇదే చివరి సినిమా కొవచ్చునని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ మూవీ మొదటి ఆటకే నెగిటివ్ టాక్ రావడంతో మెగా అభిమానుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. అయితే సినిమాపై అంచనాలతో భారీ బుకింగ్స్ నమోదైనప్పటికీ మొదటిరోజు కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశాలున్నాయి. కానీ సినిమాకు మాత్రం మిక్స్ డ్ టాక్ వినిపిస్తుండటంతో బాక్సాఫీస్ వార్ లో జైలర్ దే పై చేయి అని చెప్పక తప్పదు.
Also Read: Shree Rapaka: పెళ్లికి ముందు సెక్స్ చేయడం తప్పు కాదు.. బోల్డ్ బ్యూటీ శ్రీరాపాక
Related News
Celebrities Vote : చిరు, చెర్రీ, ఎన్టీఆర్, మహేష్‌బాబు ఓటు వేసే పోలింగ్ కేంద్రాలివే
Celebrities Vote : రేపే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ఓట్ల పండుగ జరగబోతోంది.