Rajashekhar : రాజశేఖర..ఈ వయసులో ఈ రిస్క్ అవసరమా..?
Rajashekhar : తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయినా 'లబ్బర్ పందు' (Lubber Pandh) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రాజశేఖర్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం
- By Sudheer Published Date - 03:23 PM, Thu - 24 April 25

ఒకప్పుడు యాంగ్రీ యంగ్ మ్యాన్ గా తెలుగు తెరపై రాబోయే హీరోలందరికీ స్ఫూర్తిగా నిలిచిన రాజశేఖర్ (Rajashekhar ), గత కొంతకాలంగా సరైన హిట్ లేక వెనుకబడిపోయారు. సమకాలీన హీరోలైన జగపతిబాబు, శ్రీకాంత్ వంటి వారు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా తమకు ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నప్పటికీ, రాజశేఖర్ మాత్రం ఆ మార్గంలో కూడా అంతగా నిలదొక్కుకోలేకపోయారు. ఆయన నటించిన ‘శేఖర్’, ‘గడ్డం గ్యాంగ్’, ‘నితిన్ ఎక్స్ ట్రాడినరీ మ్యాన్’ లాంటి చిత్రాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి.
Pahalgam terror attack : ఉగ్రదాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు: ప్రధాని మోడీ
ఈ క్రమంలో తాజాగా తమిళంలో సూపర్ హిట్ అయినా ‘లబ్బర్ పందు’ (Lubber Pandh) చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసేందుకు రాజశేఖర్ సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇందులో వయసు మళ్ళిన ఒక తండ్రికి, అల్లుడు కావాలనుకున్న ఒక కుర్రాడికి మధ్య క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా జరుగుతుంది. పల్లెటూరి నేపథ్యంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామకు పెద్ద బడ్జెట్ అక్కర్లేదు. ఎమోషన్, ఎంటర్ టైన్మెంట్, లవ్ స్టోరీ ఇలా అన్ని పుష్కలంగా ఉంటాయి. కాకపోతే మన నేటివిటీకి సూటవ్వడం గురించే అనుమానం లేకపోలేదు. తెలుగు ఆడియోతో సహా ఇది ఓటిటిలో అందుబాటులో ఉంది. మరి రాజశేఖర్ అంతా తెలిసి రిస్క్ తీసుకోవడం అవసరమా అని ఇండస్ట్రీ వారు అంటున్నారు. చూద్దాం మరి రాజశేఖర్ ఫైనల్ గా ఏ నిర్ణయం తీసుకుంటారా అని.