Rowdy Janardhan : విజయ్ దేవరకొండ సినిమాలో రాజశేఖర్..?
Rowdy Janardhan : ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర కోసం సీనియర్ హీరో డా. రాజశేఖర్(Rajasekhar)ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చిత్రబృందం ఇటీవల ఆయనపై ఫోటో షూట్ నిర్వహించినట్లు, ఆయన లుక్‌కు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం
- By Sudheer Published Date - 12:18 PM, Wed - 14 May 25

యూత్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ప్రస్తుతం ‘కింగ్‌డమ్’ (kingdom) మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయ్యాక, దిల్ రాజు బ్యానర్‌లో ‘రౌడీ జనార్ధన్’ (Rowdy Janardhan) అనే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. ఈ సినిమాకు ‘రాజావారు రాణీగారు’ దర్శకుడు రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ప్రతినాయక పాత్ర కోసం సీనియర్ హీరో డా. రాజశేఖర్(Rajasekhar)ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. చిత్రబృందం ఇటీవల ఆయనపై ఫోటో షూట్ నిర్వహించినట్లు, ఆయన లుక్‌కు సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
India Vs China : చైనాపై భారత్ కొరడా.. గ్లోబల్ టైమ్స్ ‘ఎక్స్’ ఖాతా బ్యాన్.. కారణమిదీ
రాజశేఖర్ ఈ మధ్యకాలంలో విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో నటించారు. అయితే అందిన కొన్ని మంచి ఆఫర్లను తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈసారి మాత్రం విజయ్ దేవరకొండతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం రావడంతో, ఈ కాంబినేషన్ పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న రాజశేఖర్, ఒక శక్తివంతమైన విలన్ పాత్రలో కనిపిస్తే, సినిమాకు మరింత బలాన్ని చేకూరుస్తుందని భావిస్తున్నారు.
ఈ సినిమాలో కథానాయికగా రష్మిక మందన్న పేరు ప్రచారంలో ఉంది. ఆమె విజయ్ దేవరకొండతో కలిసి ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటించి విజయాన్ని సాధించింది. అటువంటి హిట్ కాంబో మళ్లీ ‘రౌడీ జనార్ధన్’లో రిపీట్ అయితే, అభిమానులకు పండగే. మరి ఈ సినిమా విశేషాలు ఏంటో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.