Rajamouli: మహేశ్ కోసం అద్భుతమైన కథలు రెడీ!
రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలయిక లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది.
- By Balu J Published Date - 02:39 PM, Mon - 11 April 22
రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలయిక లో వచ్చిన ఆర్ఆర్ఆర్ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. అయితే ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తీయబోయే తదుపరి సినిమా గురించి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదరుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తన నెక్ట్స్ మూవీ మహేశ్ తో ఉంటుందని స్పష్టం చేశాడు రాజమౌళి. మహేష్ కోసం రెండు అద్భుతమైన కథలు సిద్ధంగా ఉన్నాయని ఆయన అన్నాడు. కరోనా కారణంగా ‘RRR’ సినిమా పలుమార్లు వాయిదా పడినప్పుడు.. ఆ సమయంలో తన తండ్రి(విజయేంద్రప్రసాద్)తో కలిసి కథాచర్చలు జరిగాయని, రెండూ ఎగ్జైటింగ్ కథలను ఓకే చేశామని జక్కన్న క్లారిటీ ఇచ్చాడు.
మహేశ్ ఇమేజ్ ను ద్రుష్టిలో ఉంచుకొని అద్భుతమైన కథతో సినిమాను తెరకెక్కిస్తానని రాజమౌళి అన్నాడు. 2022 చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించాలని రాజమౌళి భావిస్తున్నాడు. ఇతర వివరాలను నిర్మాత వెల్లడించే అవకాశాలున్నాయి. కాగా రాజమౌళి తండ్రి, రచయిత విజేంద్రప్రసాద్ మాత్రం మహేశ్ కోసం ‘ఫారెస్ట్ అడ్వైంచర్ నేపథ్యం’లో కథ సిద్ధమైందనీ పలుసార్లు మీడియాకు వెల్లడించారు. ఈ రెండు కథల్లో మహేశ్ దేనిని సెట్స్ పైకి తీసుకెళ్తారో వేచి చూడాల్సిందే!
Related News
Nani: హీరో నాని, సుజిత్ మూవీ ఆగిపోయిందా!
Nani: నాన్ థియేట్రికల్ మార్కెట్ పతనం, థియేట్రికల్ రంగంలో హెచ్చుతగ్గులు కొన్ని ప్రాజెక్టులకు పెను ముప్పుగా మారుతున్నాయి. సుజీత్ దర్శకత్వంలో నాని ఓ సినిమాకు సైన్ చేయగా, అది భారీ బడ్జెట్ తో ప్లాన్ చేసిన యాక్షన్ మూవీ. డీవీవీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రస్తుతం వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం బడ్జెట్ సమస్యల కారణంగా ప్రస్తుతానికి ఈ సినిమా ఆగిపోయింది. డ�