HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Rajamouli Praises Mega Star Chiranjeevi

Tollywood: ఎప్పటికీ ఇండస్ట్రీ పెద్ద చిరంజీవే.. మమ్మల్ని నెగ్గించడానికి ఎంతో తగ్గి మాట్లాడారు – ‘రాజమౌళి’..!

  • Author : Hashtag U Date : 20-03-2022 - 11:35 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
60
60

మెగాస్టార్ చిరంజీవి పై సంచలన కామెంట్స్ చేశారు దర్శక ధీరుడు రాజమౌళి. ఇందుకు కర్ణాటక రాష్ట్రంలోని చిక్కబళ్లాపూర్ లో నిర్వహించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికైంది. సినీ ఇండస్ట్రీ బాగుకోసం మెగాస్టార్ చేస్తున్న కృషిని రాజమౌళి ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. జగన్ సర్కార్ పది నెలల క్రితం సినిమా టికెట్ ధరలు తగ్గించినప్పుడు, ఇది చిత్ర పరిశ్రమకు ఇబ్బందికరం అని భావించాం. అదే విషయాన్ని ప్రభుత్వానికి అర్థమయ్యేట్టు చెప్పడానికి చాలా ప్రయత్నించాం.

వ్యక్తిగతంగా నేనూ ప్రయత్నించాను, ఇండస్ట్రీ మొత్తం ప్రయత్నించింది. కాకపోతే, ఎవరం కూడా ముందుకు వెళ్లలేకపోయాం. కానీ… ఒక వ్యక్తి వచ్చి, సీఎం జగన్ తో తన సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, రెండు మూడు సార్లు వెళ్లి ముఖ్యమంత్రిని కలిసి, మొత్తం పరిస్థితిని వివరించారు. ఆయన ప్రయత్నాల ఫలితమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త జీవో ఇవ్వడం. అలా సినిమా టికెట్ ధరలు పెంచేందుకు కారకుడైన వ్యక్తి మన మెగాస్టార్ చిరంజీవి గారే. ఈ విషయంలో చిరంజీవిని చాలామంది అనేక రకాలుగా మాటలు అన్నారు.

మమ్మల్ని నెగ్గించడానికి… ఆయన తగ్గి ఆ మాటలన్నీ పడ్డారు. చిరంజీవి గారూ… మీరు నిజంగా మెగాస్టార్ అని అన్నారు రాజమౌళి. ఇంకా చిరంజీవి గురించి చెప్పాలంటే… చాలామందికి తెలియని విషయం ఇంకోటుంది. కేసీఆర్ సర్కార్ నుంచి గతంలో వచ్చిన జీవోకి కూడా చిరంజీవి గారే కారణం. ఆయన తెరవెనుక ఉండి అంతా నడిపించారు. ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం చిరంజీవి గారికి ఇష్టం ఉండదు. ఇండస్ట్రీ బిడ్డగానే ఉండాలనుకుంటారు. నేను మాత్రం ఆయనను ఎప్పటికీ ఇండస్ట్రీ పెద్దగానే భావిస్తాను. చిత్ర పరిశ్రమ అంతా కూడా ఆయనకు రుణపడి ఉండాలి అని భావోద్వేగంతో వ్యాఖ్యానించారు రాజమౌళి.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు రాజమౌళి. అలానే మెగాస్టార్ చిరంజీవికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు దర్శక ధీరుడు రాజమౌళి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • megastar chiranjeevi
  • RRR Movie
  • ss rajamouli

Related News

    Latest News

    • రైల్వే ప్ర‌యాణికుల‌కు మ‌రో అదిరిపోయే సూప‌ర్ న్యూస్‌!

    • ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం.. ప్రచురణకర్త సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

    • అర్జున్ టెండూల్క‌ర్‌ పెళ్లికి ప్ర‌ధాని మోదీ?!

    • న‌మీబియాతో మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బ్యాడ్ న్యూస్‌!

    • అమెరికాకు బిగ్ షాక్ ఇచ్చిన భార‌త్‌!

    Trending News

      • కొత్త ఆదాయపు పన్ను చట్టం.. ఏప్రిల్ 1 నుండి అమలు!

      • భారత్-పాక్ మ్యాచ్ బహిష్కరణ.. పీసీబీ నిర్ణయంపై గంగూలీ విస్మయం!

      • సిరాజ్ ‘బిర్యానీ’ తింటూ వచ్చి వికెట్లు తీశాడు: మాజీ క్రికెట‌ర్‌

      • విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన సూర్య‌కుమార్ యాద‌వ్‌!

      • అంతరిక్షంలో చైనా ఆధిపత్యం పెరుగుతుందా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd