Rajamouli Mahesh movie title : మహేష్ మహారాజా అవుతున్నాడా.. రాజమౌళి సినిమాకు టైటిల్ అదేనా..!
Rajamouli Mahesh movie title సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమా గురించి బయటకు వస్తున్న ప్రతి అప్డేట్ ఫాన్స్ ని
- By Ramesh Published Date - 09:36 AM, Fri - 16 February 24

Rajamouli Mahesh movie title సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమా గురించి బయటకు వస్తున్న ప్రతి అప్డేట్ ఫాన్స్ ని ఖుషి చేస్తుంది. కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే మహేష్ లుక్కు విషయంలో కొత్తగా ట్రై చేస్తున్నారని తెలుస్తుంది. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకున్న మహేష్ రాజమౌళి సినిమా కు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టాడు. ఈ సినిమాలో మహేష్ గడ్డంతో ఉంటాడని టాక్.
యాక్షన్ అడ్వెంచర్ మూవీ గా రాబోతున్న ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారని టాక్. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ మూవీకి మహారాజా అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. రాజమౌళి డైరెక్షన్లో మహేష్ చేయబోతున్న సినిమాకు ఇది పర్ఫెక్ట్ టైటిల్ అంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. ఆర్ ఆర్ ఆర్ తో హాలీవుడ్ డైరెక్టర్స్ ను కూడా మెప్పించిన రాజమౌళి మహేష్ సినిమాకు నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్ తో ఉన్నాడని చెప్పుకుంటున్నారు.
ఈ సినిమాకు టెక్నీషియన్స్ కూడా హాలీవుడ్ నుండి తెప్పిస్తున్నారట. మహేష్ తో రాజమౌళి చేస్తున్న సినిమా ఫ్యాన్ ఇండియా కాదు ఫ్యాన్ వరల్డ్ మూవీ గా రాబోతుందని చెప్పొచ్చు. సినిమా హీరోయిన్ మిగతా కాస్టింగ్ గురించి త్వరలో డీటెయిల్స్ బయటకు రానున్నాయి. ఈ సినిమా మార్చ్ నుండి సెట్స్ మీదకు వెళుతుందని ఫిల్మ్ నగర్ సమాచారం.