Viral : భార్యతో అదిరిపోయే స్టెప్పులేసిన రాజమౌళి
Viral : ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలోని ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడి పెళ్లి ఈవెంట్ లో రాజమౌళి-రమా జంట డాన్స్ చేస్తూ సందడి చేశారు.
- By Sudheer Published Date - 05:56 PM, Sat - 14 December 24

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (Rajamouli) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. సాధారణంగా సైలెంట్‌గా, నిరాడంబరంగా ఉండే రాజమౌళి తన భార్య రమా రాజమౌళితో కలిసి అదిరిపోయే స్టెప్పులు (Rajamouli Dance) వేసి ఆకట్టుకున్నారు. ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’ చిత్రంలోని ‘లంచ్ కొస్తావా మంచె కొస్తావా’ పాటకు స్టెప్పులేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి కుమారుడి పెళ్లి ఈవెంట్ లో రాజమౌళి-రమా జంట డాన్స్ చేస్తూ సందడి చేశారు. ఈ వీడియో చూసిన సినీ ప్రముఖులు, అభిమానులు రాజమౌళి టాలెంట్‌ను ప్రశంసిస్తున్నారు. ఆయనలోని డాన్స్ టాలెంట్ ను బయటకు తీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
“జక్కన్న అదరగొట్టారు” అంటూ సోషల్ మీడియాలో అభిమానులు , నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. రాజమౌళి సినిమాల విషయానికొస్తే.. ‘RRR’ లాంటి పాన్ ఇండియా హిట్ తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘SSMB29’ మూవీ చేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో పలువురు హాలీవుడ్ టెక్నీషియన్స్ భాగం కానున్నారు. ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్‌గా నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన లొకేషన్స్ సెర్చ్‌లో భాగంగా ఇటీవల ఆఫ్రికాలోని అడవుల్లో పర్యటించారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తీ చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జనవరిలో మొదలు కానుంది.
#viralvideo తన భార్య రమా రాజమౌళి గారితో కలిసి అదిరిపోయే స్టెప్పులేసిన దర్శకధీరుడు @ssrajamouli #HashtagU pic.twitter.com/obUE4Tms5u
— Hashtag U (@HashtaguIn) December 14, 2024
Read Also : PV Sindhu ot Engaged : ఎంగేజ్మెంట్ చేసుకున్న సింధు