Hip Hop India Winner: హిప్ హాప్ ఇండియా విన్నర్ రాహుల్ భగత్
అమెజాన్ మినీ టీవీ డాన్స్ రియాలిటీ షో ' హిప్ హాప్ ఇండియా ' గ్రాండ్ ఫినాలే వేదికపై బాద్షా మరియు రఫ్తార్ తమ ర్యాప్ తో సభ మొత్తాన్ని ఉర్రూతలూగించారు
- By Praveen Aluthuru Published Date - 07:31 AM, Sat - 2 September 23

Hip Hop India Winner: అమెజాన్ మినీ టీవీ డాన్స్ రియాలిటీ షో ‘ హిప్ హాప్ ఇండియా ‘ గ్రాండ్ ఫినాలే వేదికపై బాద్షా మరియు రఫ్తార్ తమ ర్యాప్ తో సభ మొత్తాన్ని ఉర్రూతలూగించారు. ఈ పోటీలో రాహుల్ భగత్ ‘హిప్ హాప్ ఇండియా’ విజేతగా నిలిచారు.రాహుల్ నిస్సాన్ మ్యాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ కారుతో పాటు హిప్-హాప్ ఇండియా ఛాంపియన్‌షిప్ బెల్ట్ మరియు రూ. 20 లక్షల ప్రైజ్ మనీని అందుకున్నాడు. ఏడు వారాల గట్టి పోటీ తర్వాత రాహుల్ భగత్ విజయం సాధించాడు. గ్రాండ్ ఫినాలేలో రాహుల్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టాడు.
రాహుల్ రాంచీ నివాసి. చిన్ననాటి నుంచి రాహుల్ డ్యాన్స్ లో ప్రావీణ్యుడు. నాలుగో తరగతి చదువుతున్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టపడేవాడు. దాదాపు దశాబ్ద కాలంగా తన నృత్యంతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ రంగంలో దాదాపు 10 టైటిల్స్ సాధించాడు.
Also Read: INDIA Alliance : ఇండియా కూటమిలో 13 మందితో సమన్వయ కమిటీ.. ఏ పార్టీ నుంచి ఎవరు?