HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Radhe Shyam Movie Event On Dec 23

Radhe Shyam: అభిమానులే అతిథులుగా.. ‘రాధే శ్యామ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు.

  • Author : Balu J Date : 18-12-2021 - 4:55 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Radhe Shyam
Radhe Shyam

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అభిమానులకు సరికొత్త సినిమాటిక్ ఫీల్ ఇవ్వడానికి వాళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియాలో మరే సినిమాకు సాధ్యం కాని స్థాయిలో ఓకే సినిమా కోసం రెండు డిఫరెంట్ మ్యూజిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయి. ఇటు సౌత్.. అటు నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా అత్యున్నత సంగీత దర్శకులతో పాటలు సిద్ధం చేయిస్తున్నారు రాధే శ్యామ్ టీం. ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ పూర్తైపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన రాధే శ్యామ్ పాటలన్నింటికీ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా వచ్చిన సంచారి సాంగ్ టీజర్ కూడా అదిరిపోయింది. జస్టిన్ ప్రభాకరన్ అద్భుతమైన సంగీతం అందించారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ సాంగ్ టీజర్ వైరల్ అవుతుంది. పూర్తి పాట డిసెంబర్ 16న విడుదల కానుంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో అప్‌డేట్ బయటికి వచ్చింది. డిసెంబర్ 23న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. అభిమానులే అతిథులుగా ఈ పాన్ ఇండియన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ కార్యక్రమం రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. పూర్తిగా కోవిడ్ నిబంధనలు పాటించి ఈ వేడుక జరుగనుంది. అక్కడికి వచ్చిన అభిమానులు అతిథులు నిబంధనలకు కట్టుబడి రావాలి అంటూ చిత్ర యూనిట్ తెలిపారు. అదే రోజు 5 భాషలకు సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. అంతే కాదు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ అభిమానులు అక్కడికి రానున్నారు. వాళ్ళ చేతుల మీదుగానే ట్రైలర్ విడుదల కానుంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియన్ హీరో.. తన సినిమా ట్రైలర్ అభిమానులతో విడుదల చేయించడం నిజంగా గొప్ప విషయం. ఈ సినిమా కోసం చాలా మంది సంగీత దర్శకులు పని చేస్తున్నారు.

జస్టిన్ ప్రభాకరన్, అర్జిత్ సింగ్, మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్, జబిన్ నౌతీయల్, మనోజ్ ముంటాషిర్, కుమార్, రష్మీ విరాగ్ బృందం అంతా కలిసి సౌత్, నార్త్ వర్షన్స్‌కు రాధే శ్యామ్ సినిమాకు అద్భుతమైన క్లాసిక్ సంగీతం అందిస్తున్నారు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఒకేసారి ఒక సినిమాకు రెండు భాషల్లో వేర్వేరు సంగీత దర్శకులు పని చేయడం ఇదే తొలిసారి. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ.. కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్  ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా ఉన్నతంగా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్‌తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణగా నిలిచింది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి దర్శక నిర్మాతలు. జనవరి 14, 2022న సినిమా విడుదల కానుంది.

నటీనటులు:
ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్‌కర్, ప్రియదర్శి తదితరులు..

టెక్నికల్ టీమ్:

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె కె  రాధాకృష్ణ కుమార్
నిర్మాతలు: వంశీ, ప్ర‌మోద్, ప్ర‌సీధ‌
బ్యానర్స్: గోపీ కృష్ణ మూవీస్, యూవీ క్రియేష‌న్స్
సంగీతం: జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ),
సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస,
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ: నిక్ పావెల్‌
డైర‌క్ట‌ర్ ఆఫ్ కొరియోగ్ర‌ఫీ: వైభ‌వి మ‌ర్చంట్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌: రవీందర్
సౌండ్ ఇంజ‌నీర్‌: ర‌సూల్ పూకుట్టి
ప్రొడక్షన్ కంపెనీస్: యువీ క్రియేషన్స్, టి సిరీస్
పిఆర్ఓ : ఏలూరు శ్రీను


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • pooja hegde
  • prabhas
  • radhe shyam

Related News

Prabhas About Love

Prabhas Love : ప్రభాస్ లో ప్రేమ చిగురించిందా..? త్వరలోనే గుడ్ న్యూస్ వినబోతున్నామా ?

"నాకు కూడా ప్రేమలో పడాలని ఉంది.. ఆ అద్భుతమైన ఫీలింగ్‌ను అనుభవించాలని ఉంది" అని ఆయన చెప్పడం గమనార్హం. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలకు మొహమాటపడే ప్రభాస్, ఈసారి చాలా నిజాయితీగా ఆ 'మూమెంట్' కోసం తాను కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ప్రకటించారు

    Latest News

    • ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసి..ఆ తర్వాత సావిత్రి లెవల్లో నటించిన భార్య

    • Honey Trap : కోడిపెట్టను ఎరగా వేసి పుంజు ఎత్తుకెళ్లారు..వీళ్లు మాములు కిలాడీలు కాదు !!

    • Good News : సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంటనూనె ధరలు?

    • Carrot and Beetroot Prices : భారీగా తగ్గిన క్యారెట్, బీట్రూట్ ధరలు

    • Kitchen Budget : సామాన్యుడి పై కిచెన్ బడ్జెట్ భారం.. పెరగనున్న కిరాణా బిల్లు!

    Trending News

      • రెండో పెళ్లి చేసుకున్న టీమిండియా మాజీ క్రికెట‌ర్‌!

      • పీఎం జ‌న్ ధ‌న్‌.. బ్యాంక్ ఖాతాలో డ‌బ్బు లేక‌పోయినా రూ. 10 వేలు తీసుకోవ‌చ్చు!

      • భారత్ vs సౌతాఫ్రికా టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 మ్యాచ్.. ఎక్క‌డ చూడాలి?!

      • డోనాల్డ్ ట్రంప్ షాకింగ్ కామెంట్స్..సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరించి, వాణిజ్య యుద్ధానికి సిద్ధం!

      • టీ20 ప్రపంచ కప్.. సూపర్ 8 పోరుకు రంగం సిద్ధం!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd