Pushpa 2 Trailer : మెగా హీరోలు నో కామెంట్స్
Pushpa 2 Trailer : ట్రైలర్ చూసిన పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మెగా హీరోలు మాత్రం దీనిపై ఎలాంటి పోస్ట్ చేయలేదు...కనీసం ఓ కామెంట్ కూడా చేయకపోవడం ఇప్పుడు చర్చగా మారుతుంది.
- By Sudheer Published Date - 10:47 AM, Mon - 18 November 24

పుష్ప (Pushpa) అంటే ఫైర్ అనుకున్నావా..వైల్డ్ ఫైర్ ..పుష్ప అంటే నేషనల్ అనుకుంటిరా.. ఇంటర్నేషనల్..ఇలా ప్రతి ఒక్కరు నిన్న సాయంత్రం నుండి మాట్లాడుకుంటున్నారు. యావత్ సినీ ప్రేక్షకులు , సినీ ప్రముఖులు పుష్ప 2 ట్రైలర్ అద్భుతం..అంటుంటే మెగా హీరోలు మాత్రం మౌనం గా ఉండడం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.
అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో తెరకెక్కిన పుష్ప 2 డిసెంబర్ 05 న వరల్డ్ వైడ్ గా అనేక భాషల్లో గ్రాండ్ గా విడుదల కాబోతుంది. ఈ సినిమా పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయో చెప్పాల్సిన పనిలేదు. సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఏమాత్రం తీసిపోని రీతిలో సినిమా తెరకెక్కిందని తాజాగా విడుదలైన ట్రైలర్ చెప్పకనే చెపుతుంది.
పుష్ప 2 సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ (Pushpa 2 Trailer Launch) నిన్న ఆదివారం సాయంత్రం పాట్నా(Patna)లో గాంధి మైదాన్ లో అట్టహాసంగా జరిగింది. UV మీడియా ఈ ఈవెంట్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఊహించినదానికంటే ఎక్కువ మంది తరలివచ్చారు. దీంతో గాంధీ స్టేడియం ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది. నార్త్ండియాలో మన తెలుగు హీరోకు ఇంత క్రేజ్ ఉండడం చూసి నార్త్ హీరోలు , సినీ ప్రముఖులుషాక్ అవుతున్నారు. ఇక ఈ ఈవెంట్ కు దాదాపు 2లక్షల మంది వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
ఇక ట్రైలర్ కటింగ్ కూడా అదిరిపోయింది. సీక్వెల్లో పుష్ప ఇంటర్నేషనల్ లెవెల్లో ఎదిగిపోయినట్లు చూపించారు. ప్రతి షాట్ ఊర మాస్‌గా ఉంది. ఫుల్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ సీన్స్‌తో సుకుమార్ సినిమాపై అంచనాలు మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. బన్నీ డైలాగ్స్, మేనరిజం మరోసారి ట్రెండ్ సెట్ చేయనున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇక పోలీస్ ఆఫీసర్ బన్వర్ సింగ్ షెఖావత్ పాత్ర కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది. ‘పుష్ప అంటే ఫైర్ కాదు- వైల్డ్ ఫైర్’ అనే కొత్త డైలాగ్‌తో ఈసారి బన్నీ బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపబోతున్నట్లు అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ నెట్టింట సంచలనం సృష్టిస్తోంది. ట్రైలర్ చూసిన పలువురు సెలబ్రిటీలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ లోడింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మెగా హీరోలు మాత్రం దీనిపై ఎలాంటి పోస్ట్ చేయలేదు…కనీసం ఓ కామెంట్ కూడా చేయకపోవడం ఇప్పుడు చర్చగా మారుతుంది.
గతకొంతకాలంగా మెగా హీరోస్ vs బన్నీ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. దీనికి కారణం ఇటీవల అల్లు అర్జున్ చేస్తున్న కామెంట్స్ , వ్యవహరిస్తున్న తీరే. తన సొంతకాళ్ల మీద పైకివచ్చినట్లు , చిరంజీవి , మెగా అభిమానుల సపోర్ట్ లేకుండానే ఈరోజు నేషనల్ స్టార్ అయినట్లు చెప్పుకొస్తుండడం..ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా వైసీపీ కి సపోర్ట్ చేయడం ఇవన్నీ కూడా మెగా హీరోల్లో ఆగ్రహం నింపుతూ వస్తున్నాయి. అందుకే వారు కూడా డైరెక్ట్ గా అల్లు అర్జున్ కు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఈ వివాదం వల్లే కావొచ్చు పుష్ప 2 విషయంలో వారు జోక్యం చేసుకోవడం లేదు.
Read Also : Ruturaj Gaikwad: భారత్‌కు పయనమైన ఇద్దరు టీమిండియా ఆటగాళ్లు!