Pushpa 2 Pushed: పుష్ప పార్ట్-2 రిలీజ్ అయ్యేది అప్పుడే!
క్రియేటివ్ డైరెక్టర్ సుక్కు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఎంత హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే.
- By Balu J Published Date - 02:08 PM, Tue - 28 June 22
క్రియేటివ్ డైరెక్టర్ సుక్కు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప ఎంత హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లోనూ మంచి కలెక్షన్లు సాధించింది. దీంతో పార్ట్-2 పై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప రెండోవ భాగం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ప్రతిఒక్కరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే పార్ట్-1 విడుదలై.. ఆరు నెలలు గడుస్తున్నా.. దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ ఇంకా స్వీక్వెల్ పై నిర్ణయం తీసుకోలేదు.
“పుష్ప 2” స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాలేదు. దర్శకుడు సుకుమార్ సెకండ్ పార్ట్ కోసం ఇప్పటికీ వర్క్ చేస్తున్నాడట. ఇక అల్లు అర్జున్ తన కుటుంబంతో గడుపుతున్నాడు. తాజాగా షూటింగ్ తేదీని అక్టోబర్‌కు వాయిదా వేసినట్లు చిత్రబృందం నుంచి సమాచారం అందుతోంది. విడుదల ప్లాన్లు మారాయి. నిజానికి డిసెంబర్ 2023 విడుదల చేయాలని భావించారు. కానీ 2024లో విడుదల చేయాలన్నది మరో ప్లాన్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న “పుష్ప 2” భారీ బడ్జెట్‌తో భారీ స్థాయిలో రూపొందనుంది. మొదటి భాగాన్ని 150 కోట్లతో నిర్మించారు. రెండో భాగానికి 400 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు. రెండో భాగానికి హిందీ ప్రేక్షకులే ప్రధాన లక్ష్యం. అందుకే స్క్రిప్ట్ వర్క్‌లో జాప్యం జరుగుతోంది.
Related News
Samantha : పుష్ప 2లో సమంత కానీ అందుకు కాదా.. సుకుమార్ ప్లాన్ ఏంటో..?
Samantha సుకుమార్ అల్లు అర్జున్ కాంబోలో వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో సూపర్ హిట్టైన సినిమా పుష్ప పార్ట్ 1 ది రైజ్. త్వరలో పార్ట్ 2 పుష్ప ది రూల్ రాబోతుంది. సినిమాను ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేయగా