Pushpa 2 : నార్తో దుమ్మురేపుతున్న ‘పుష్ప-2’
Pushpa 2 : థియేటర్లలో విడుదలైన 5 రోజుల్లోనే రూ.339 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నిన్న రూ.48 కోట్లు రాబట్టగా, అంతకుముందు తొలి 4 రోజుల్లో వరుసగా రూ.72 కోట్లు, రూ.59 కోట్లు, రూ.74కోట్లు, రూ.86 కోట్లు సాధించింది
- By Sudheer Published Date - 03:32 PM, Tue - 10 December 24

పుష్ప2(Pushpa2) .. ఇప్పుడు ఇండియాలో ఎక్కడ విన్న ఇదే మాట. ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) ఇండియాలోనే కాదు వరల్డ్ వైడ్ గా బాక్సాఫీసులను షేక్ చేస్తోంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ రూ.1,000 కోట్లు సునాయాసంగా సాధించేలాగా ఉంది. ఇప్పటికే ఆ ఫిగర్‌కి చాలా దగ్గరగా వచ్చింది. ముఖ్యంగా నార్త్ లో కలెక్షన్లు దుమ్ములేపడం అక్కడి హీరోలను నిద్ర పట్టకుండా చేస్తుంది. ఇప్పటీకే తెలుగు చిత్రాలు ఆస్కార్ లెవల్లో దుమ్ములేపడంతో అసూయతో ఉన్న వారు..ఇప్పుడు వరుసపెట్టితెలుగు చిత్రాలు నార్త్ లో కుమ్మేస్తుండడం తో వారంతా తెలుగు డైరెక్టర్స్ వైపు చుస్తునారు.
ఇక ‘పుష్ప-2’ హిందీ కలెక్షన్స్ రూ.400కోట్లకు చేరువలో ఉన్నాయి. థియేటర్లలో విడుదలైన 5 రోజుల్లోనే రూ.339 కోట్లు వసూలు చేసినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. నిన్న రూ.48 కోట్లు రాబట్టగా, అంతకుముందు తొలి 4 రోజుల్లో వరుసగా రూ.72 కోట్లు, రూ.59 కోట్లు, రూ.74కోట్లు, రూ.86 కోట్లు సాధించింది. నార్త్ అమెరికాలో $10M+ వసూళ్లతో దూసుకుపోతోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం పుష్ప 2 హడావిడి తగ్గింది.
‘పుష్ప 2’ చిత్రానికి రూ.600 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.605 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజులు అంటే మొదటి వీకెండ్ ముగిసేసరికి ఈ సినిమా రూ.348.22 కోట్ల షేర్ ను రాబట్టి ఆల్ టైం రికార్డులు సృష్టించింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.256.78 కోట్ల షేర్ రావాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్ట్ చేయడం లేదు. గుంటూరు, కృష్ణా, సీడెడ్ బాగానే ఉన్నా మిగిలిన ఏరియాల్లో ఆశించిన స్థాయిలో వసూళ్లు చేయలేకపోతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు.
Read Also : R Krishnaiah : నేను అడగలేదు.. బీజేపీయే పిలిచి రాజ్యసభ ఛాన్స్ ఇచ్చింది : ఆర్ కృష్ణయ్య